MOVIE NEWS

Mega 157 : షూటింగ్ అప్డేట్.. లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..?

మెగాస్టార్ చిరంజీవి,బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్ “Mega157”.. త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అద్భుతమైన లొకేషన్స్‌లో జరుగుతుంది..

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..?

చిత్ర యూనిట్ ప్రస్తుతం కేరళలో ఒక కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, నయనతారలు జంటగా కనిపించనున్నారు. పెళ్లి సందడి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సాంగ్ పూర్తిగా జాయ్‌ఫుల్ మూడ్ లో సాగుతుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం… ఈ షెడ్యూల్‌లో సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారటా.. ఈ షూటింగ్ షెడ్యూల్ జులై 23, 2025 నాటికి పూర్తవుతుందని తెలుస్తుంది.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు..

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో వున్నాడు.. మెగాస్టార్ సినిమాను కూడా తనదైన స్టైల్ లో మరింత ఎంటర్టైనింగ్ తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి సిద్ధం అవుతున్నాడు..ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

Related posts

ఆ బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో చరణ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ..?

murali

సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!!

murali

war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!!

murali

Leave a Comment