MOVIE NEWS

Mega 157 : గ్రాండ్ గా పూజా కార్యక్రమం.. వీడియో వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి,స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో బిగ్గెస్ట్ మూవీ రాబోతోందన్న సంగతి తెలిసిందే..ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసిన అనిల్ రావిపూడి..నేడు ఉగాది సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.. పూజా కార్యక్రమాలతో ఈ మూవీ వేడుక ప్రారంభం అయ్యింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, వెంకటేష్, దిల్ రాజు, నాగబాబు సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.ఈ మూవీని” మెగా 157 ”అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ తర్వాత జరగనున్నట్లు సమాచారం..ఈ గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.అనిల్ రావిపూడి మూవీలో మెగాస్టార్ చిరంజీవి తన అసలు పేరు అయిన శివశంకర వరప్రసాద్ గా నటిస్తున్నారు..

ఓజి : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్..!!

తాజాగా దీనికి సంబంధించి ఇటీవలే అనిల్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిల్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడం అది కూడా మెగాస్టార్ చిరంజీవితో కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అనిల్ స్టైల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెర కెక్కుతుంది.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా ఓ రోల్ కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణతి చోప్రా ను తీసుకోనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

 

Related posts

NTR-NEEL : భారీ స్థాయిలో సెకండ్ షెడ్యూల్.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..!!

murali

గేమ్ ఛేంజర్ : ట్రైలర్ రిలీజ్ వాయిదా.. మండిపడుతున్న ఫ్యాన్స్..?

murali

మేనల్లుడు కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి..!!

murali

Leave a Comment