Meenakshi Chaudhary : The next top heroine of tollywood in making
MOVIE NEWS

ఇట్స్ మీనాక్షి టైం

Meenakshi Chaudhary : The next top heroine of tollywood in making
Meenakshi Chaudhary : The next top heroine of tollywood in making

Meenakshi Chaudhary heroine tollywood : మీనాక్షి చౌదరి.. ఈ మధ్య మన టాలీవుడ్ లో భాగా వినిపిస్తున్న పేరు. హర్యానా నుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ బ్యూటీకి ఇప్పుడు చేతి నిండా ఫుల్ గా సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఓవైపు బడా స్టార్ హీరోల సరసన కనిపిస్తూనే, మరోవైపు ఈ తరం కుర్ర హీరోలకు జోడీ కడుతోంది.

ఈ సంవత్సరం ఇప్పటికే మీనాక్షి నుంచి ‘గుంటూరు కారం’, ‘సింగపూర్ సెలూన్’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(ది గోట్) వంటి చిత్రాలతో వచ్చాయి. ఇప్పుడు మరో మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉంది.

మీనాక్షి కథానాయిక గా నటించిన 3 తెలుగు సినిమాలు వరుసగా విడుదలకు రెడీ అయ్యాయి. ముందుగా మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ తో కలిసి నటించిన ”లక్కీ భాస్కర్” చిత్రం దీపావళి కానుకగా అక్టోబరు 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఇందులో సుమతీ అనే మిడిల్ క్లాస్ ఇల్లాలి క్యారెక్టర్ లో మీనాక్షి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో జనాల దృష్టిని ఆకర్షించింది. ట్రైలర్ లో కనిపించిన దాని బట్టి మంచి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది అని అర్థమవుతుంది.

ఇక నెస్ట్ లైన్ లో ఉన్న సినిమా మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి చేస్తున్న మట్కా. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నవంబరు 14న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం నుంచి ఇంకా మీనాక్షి కి సంబంధించిన టీజర్ రాలేదు దాన్ని కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అలానే మాస్ కా దాస్ విశ్వక్ సరసన ‘మెకానిక్ రాకీ’ మూవీలోనూ ఈ బ్యూటీ కథానాయిక పాత్ర పోషించింది. ఇది దీపావళి కి విడుదల కావాల్సి ఉంది కానీ నవంబరు 22కి పోస్ట్ పోన్ చేశారు చిత్ర బృందం. ఇలా మీనాక్షి 3 వారాల గ్యాప్ లో 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Read Also : మరో రంగస్థలం లో చరణ్ – సమంత….

ఓకే సీజన్ లో మూడు క్రేజీ సినిమాలు తో వస్తుండటంతో, మీనాక్షీ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయింది. ఒకేసారి మూడు చిత్రాలకు ఈక్వల్ గా టైమ్ కేటాయిస్తూ, ప్రచారం నిర్వహిస్తోంది. ఆన్ లైన్ ప్రమోషన్స్ తో పాటుగా ఆఫ్ లైన్ ప్రచారం కూడా మొదలుపెట్టింది.

దీంతో రాబోయే నెల రోజుల పాటు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మడి సందడే ఎక్కువగా కనిపించనుంది. లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ.. ఈ మూడింటిలో ఏ రెండు హిట్టయినా మీనాక్షి కెరీర్ నెక్స్ట్ లెవల్ కు చేరుకునే అవకాశం వుంది. ఎందుకంటే టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువగానే వుంది. అలాంటి టైం లో మీనాక్షి గనక రెండు హిట్స కొట్టిందంటే తో లీగ్ కి చేరుకున్నట్టే. అందం, అభినయం కలిసి వున్న ఈ సుందరికి టాలీవుడ్ వెల్కమ్ చెప్ప్తుంది.

Read Also : ప్రమోషన్స్ షురూ చేయనున్న పుష్పా

Meenakshi Chaudhary : The next top heroine of tollywood in making
Meenakshi Chaudhary : The next top heroine of tollywood in making

ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకున్న అందాల సుందరి మీనాక్షి చౌదరి.. ఫెమినా మిస్ ఇండియా-2018 & మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2018 అందాల పోటీలలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత ‘అప్‌స్టార్ట్స్’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఖిలాడి మూవీ ఫ్లాప్ అయినా, ‘హిట్ 2’ చిత్రం మంచి హిట్ ఇచ్చింది.

మీనాక్షి చౌదరి ప్రస్తుతం సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె ఒక పోలీస్ గా, వెంకీ మామా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతి పండక్కి రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో గట్టిగానే వినపడుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో మీనాక్షి కీలక పాత్ర పోషిస్తుంది. ఎలా చూసుకున్న నెస్ట్ టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మెండుగా ఉన్న నటి మీనాక్షి.

Follow us on Instagram 

Related posts

తెలుగు సినిమా అభిమానుల మధ్య మళ్ళి రాజేసుకున్న కలెక్షన్స్ కుంపటి.

filmybowl

అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!!

murali

ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

Leave a Comment