Matka Teaser Launch Varun Tej's Epic Return
VIDEOS

మట్కా టీజర్ ఎలా వుందంటే….

Matka Teaser Launch Varun Tej's Epic Return
Matka Teaser Launch Varun Tej’s Epic Return

Varun Tej Matka Teaser : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కి ఈ మధ్య అన్నీ ఫ్లాప్‌లు ఏ పలకరిస్తున్నాయి. కెరీర్ మొదటి నుంచి వైవిద్యమైన కథలనే ఎంచుకుంటూ తన సినిమా ప్రయాణాన్ని మొదలెట్టిన వరుణ్ కి కంచె తో మంచి బ్రేక్ వచ్చింది.

ఆ తర్వాత ఫిదా, తొలి ప్రేమ ఎఫ్2, ఎఫ్3తో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ గత మూడేళ్ళుగా హిట్ పడలేదు. ఐనా తన పంథాని మార్చుకోకుండా ఈసారి కూడా మరో మంచి కథ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

అదే మట్కా. కరుణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పలాస సినిమాతో మంచి దర్శకుడి గా పేరు తెచ్చుకున్న కరుణ ఆ తర్వాత సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తెరకెక్కించాడు.

ఇక ఇప్పుడు మట్కా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. వరుణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఇది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది

నవంబర్ 14 కి రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. సరే చూద్దాం పదండి ఎలా ఉందొ

Read Also : ‘వార్‌ 2’ నుంచి ఎక్స్సైటింగ్ అప్డేట్‌

వివిధ గెట‌ప్పుల్లో వరుణ్ తేజ్ న‌టిస్తున్న సినిమా…. ‘మ‌ట్కా’.

జూదం, డ్రగ్స్ , డ‌బ్బు, దొమ్మీలు యాక్ష‌న్‌.. వీటి చుట్టూ సాగే క‌థ ఇది. విశాఖపట్నం నేపధ్యం లో వాసు అనే కుర్రోడిగా వరుణ్ కనిపిస్తాడు.

దర్శకుడు క‌రుణ స్వ‌త‌హాగా మంచి ర‌చ‌యిత‌ కావడంతో. దానికి త‌గ్గ‌ట్టుగానే టీజ‌ర్ లో డైలాగులు బాగా పేలాయి.

”ఈదేశంలో చ‌లామ‌ణీ అయ్యే ప్ర‌తీ రూపాయిలో 90 పైస‌లు నూటికి ఒక్క‌డే సంపాదిస్తాడు. మిగ‌తా ప‌ది పైస‌ల కోసం 99 మంది కొట్టుకొంటారు. నువ్వు 90 పైస‌లు సంపాదించే ఒక్క‌డివి. 99 మందిలో ఒక్క‌డిలా మిగిలిపోకు. నీకా ద‌మ్ముంది”
”విశాఖ‌ప‌ట్నం అంటే ఒక‌టి స‌ముద్రం గుర్తుకు రావాలి. లేదా ఈ వాసు గుర్తుకు రావాలి”
”ధ‌ర్మం… మ‌న‌కు ఏది అవ‌స‌ర‌మో అదే ధర్మం. మ‌నిషిలో ఆశ చావ‌నంత వ‌ర‌కూ నా యాపారానికి చావు ఉండ‌దు”

ఇలాంటి సూపర్ డైలాగులతో ‘మ‌ట్కా’ టీజ‌ర్ అదిరిపోయింది అనే చెప్పుకోవాలి. హీరో క్యారెక్టరైజేష‌న్ తన బిహేవియర్ ఈ డైలాగ్ ల్లోనే క‌నిపిస్తోంది.

ఇది 1952-1982 మధ్య జరిగే డ్రామా. ఆ లుక్‌ని సెట్స్ ద్వారా, కాస్ట్యూమ్స్ ద్వారా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా తెర‌పైకి టీం చక్కగా తీసుకురాగ‌లిగింది.

మ్యూజిక్ డైరెక్టర్గా జీవీ ప్ర‌కాష్ అందించిన బీజియం సూపర్ గా ఉంది. వ‌రుణ్‌తేజ్ గెట‌ప్పులు అదిరిపోయాయి.

తాను ఈ సినిమా లో కనిపించే అన్ని గెట్ అప్స్ ని టీజర్ లో చూయించేసాడు దర్శకుడు. గ్యాంగ్ స్ట‌ర్‌గా, ఖైదీగా, డైలీ కూలి గా. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ సూపర్ గా ఉన్నాయి రిచ్ లుక్ ఉంది.

Follow us on Instagram

Related posts

మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్

filmybowl

అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్

filmybowl

సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్ గా SDT18 మేకింగ్ వీడియో రిలీజ్..

filmybowl

Leave a Comment