Mathu Vadalara 2 Movie Full Review
MOVIE REVIEWS

మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

Mathu Vadalara 2 Movie Full Review
Mathu Vadalara 2 Movie Full Review

Mathu Vadalara 2 Movie Full Review

తారాగణం: శ్రీ సింహ , సత్య, ఫారియా అబ్దుల్లా , సునీల్, వెన్నెల కిషోర్, అజయ్,రాజా, రోహిణి, ఝాన్సీ, సుదర్శన్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు
ప్రొడక్షన్: క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ , మైత్రి మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్స్: చెర్రీ , హేమలత
రైటర్ & డైరేక్షన్: రితేష్ రానా
మ్యూజిక్: కాల భైరవ
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 13, 2024

మత్తువదలరా సినిమాతో హీరో గా ఎంట్రీ తో నే మంచి విజయాన్ని అందుకున్న శ్రీసింహా కి ఆ తర్వాత నాలుగు సినిమాలు చేసిన హిట్ పలకరించలేదు.దాంతో తనకి మొదటి హిట్ ఇచ్చిన సినిమా కి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ , ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కి ప్రభాస్ , రాజమౌళి ని దింపడం తో సినీ ప్రేమికుల ద్రుష్టి ఈ సినిమా మీద పడింది.

మంచి అంచానాలతో ఈరోజు రిలీజ్ ఐన సినిమా ఎలా వుంది , సింహ కి సక్సెస్ దాహం తీర్చిందో లేదో చూద్దాం పదండి.

కథ
మత్తువదలరా సినిమా ఎక్కడైతే శుభం కార్డు పడిందో అక్కడ నుంచే మత్తువదలరా2 కథ మొదలవుతుంది. డెలివరీ ఏజెంట్స్ ఐన బాబూమోహన్ (సింహా) , యేసు (సత్య) లకి చేస్తున్న ఉద్యోగం పోవడం తో వేరొక జాబ్ ట్రైల్స్ లో వుంటారు. అదే సమయం లో హి టీం (హై ఎమర్జన్సీ టీం) లో ఉద్యోగాలు వున్నాయి అని పేపర్ లో చూసి తెలుసుకొని లంచం ఇచ్చి మరి ఆ ఉద్యోగాల్లో చేరిపోతారు. అక్కడ వీళ్ళ డ్యూటీ కిడ్నప్ కేసుల్ని డీల్ చేయడం.

ఒకే టీం లో పని చేస్తూ వచ్చే జీతం డబ్బులు సరిపోక కిడ్నప్ కేసుల్లో దొరికే సొమ్ము నుంచి కొంత “తస్కరించి” జీవితం గడిపేస్తుంటారు. కిడ్నాపర్లని పట్టుకొనే సమయం లో డబ్బు పోయిందని వీళ్ళ హెడ్ దీప (రోహిణి) కి కధలు చెప్పి తప్పించుకుంటుంటారు. ఎవరో తన కూతుర్ని కిడ్నప్ చేసి రెండు కోట్ల రూపాయిలు అడుగుతున్నారని బాబు, యేసులని సంప్రదిస్తుంది దామిని . ఇదే అదునుగా హి టీం తో సంబంధం లేకుండా ఈ కేసు ని తామే డీల్ చేసి ఆ రెండు కోట్లు నొక్కెయ్యాలని ప్లాన్ వేస్తారు. ఆ క్రమంలో అనుకోకుండా ఒక మర్డర్ కేసు లో ఇరుక్కుంటారు బాబు, యేసు.

ఆ మర్డర్ కేసు ఏంటి. ఆ మర్డర్ చేసింది ఎవరు. ఈ కేసు నుంచి బాబు,యేసు తప్పించుకోడానికి సీనియర్ అధికారి ఐన నిధి (ఫారియా) ఎలా సహాయ పడింది. ఈ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేసారు అనేది మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే:
ఈ మధ్య సీక్వెల్స్ సర్వ సాధారణం అయిపోయింది అలా అని సీక్వెల్ కి వుండే అర్ధానికి తగ్గట్టు తీస్తున్నారా అంటే అది లేదు

బాహుబలి సీక్వెల్ వచ్చిందంటే కథ కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడొస్తున్న సీక్వెల్స్ అన్ని పార్ట్ 1 ని కొంచెం అటు ఇటు కలిపి తీస్తున్నారు. అలాగే ఈ సినిమా ని పార్ట్ 1 కి కంటిన్యూ అనడం కంటే పార్ట్ 1 నే మళ్లీ చిన్న చేంజెస్ తో తీశారు అనుకోవచ్చు. పార్ట్ 1 కధనం లో వున్నా వేగం గాని, కథ గాని ఈ సీక్వెల్ లో లేవు, అలా అని సినిమా బాలేదా అంటే చాలా చోట్ల బావుంది. సత్య ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇవేమి గుర్తుకు రాకుండా చేస్తాయి .

పార్ట్ 1 చూసి థియేటర్ కి వచ్చిన వాళ్ళకి ఈ సినిమా స్టార్టింగ్ నుంచే ఆ పాత్రలతో కనెక్షన్ వచేసిద్ధి. సినిమా మొదటి హాఫ్ మొత్తం పాత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటది. అలంటి మొదటి సగం పూర్తి అయ్యేసరికి దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ మాత్రం విపరీతంగా ఆకట్టుకునిద్ది. రెండో హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రీయట్ చేసిద్ధి

ఇక రెండో హాఫ్ మొత్తం పార్ట్ 1 లో లాగానే మర్డర్ మిస్టరీ మీదే నడిపించాడు
మర్డర్ మిస్టరీ రివీల్ మొత్తం అంతగా ఆకట్టుకోదు కానీ మధ్య మధ్య లో సత్య ఇచ్చే ఎంటర్టైన్మెంట్ తో ఇవన్నీ కవర్ అయిపోతాయి. మధ్యలో ఒక హీరో పాత్ర , ఒక సీరియల్ డ్రామా కూడా సో సో గా నడుస్తాయి.

ప్రీ-క్లైమాక్స్ నుంచి మళ్లీ దర్శకుడి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అక్కడ వచ్చే చిన్న ట్విస్టులు , సినిమా ప్రధాన తారాగణం కలిసి చేసే ఒక ఫైట్ బాగా ఆకట్టుకునిద్ది , సత్య వేసే ఒక డాన్స్ ప్రేక్షకులకి సినిమా మీద మంచి ఒపీనియన్ తో బయటకి వచ్చేలాగా చేస్తుంది

పార్ట్ త్రీ కి కూడా అవకాశం ఉందనే హింట్ ఇస్తూ పార్ట్ 2 ని ముగించాడు దర్శకుడు.

Read Also : సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా
సింహా, సత్య మధ్య కామెడీ కెమిస్ట్రీ ఫుల్ గా వర్కౌట్ ఐంది. ఒక మాటలో చెప్పాలంటే సత్య ఈ సినిమా కి పెద్ద అసెట్. దర్శకుడి లోపం ఉన్న సీన్స్ కూడా స్క్రీన్ మీద పండాయి అంటే దానికి కారణం సత్య కామెడీ టైమింగ్. మంచి పాత్రలు పడితే సత్య ని ఆపలేం అనడానికి ఈ సినిమా నిదర్శనం.

ఈ సినిమా కి సరికొత్త ఆకర్షణ ఫారియా అబ్దుల్లా . ఆక్షన్ + సస్పెన్సు ఉన్న క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. ఇంకా మిగిలిన ఆర్టిస్ట్స్ అందరూ ఇచ్చిన పరిధిలో ఆకట్టుకున్నారనే చెప్పాలి

కాల భైరవ కథ కి సరిపడా BGM తో సీన్స్ ని చాల వరకు ఎలేవేటే చేసాడు. సినిమా కి అనుకున్న బడ్జెట్ లో రిచ్ గా కనిపించింది, ఎడిటింగ్ & సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరాయి

ఇక డైరెక్టర్ రితేష్ రానా లో చాలా మంచి హ్యూమర్, సెటైరికల్ కళ చాలా చోట్ల కనపడింది
నచ్చిన వాళ్ళకి ఇంకా నచ్చేసిద్ధి
యేసు పాత్ర మీతోనే వస్తు మిమ్మల్ని బాగా నవ్విస్తుంది

చివరగా

మత్తువదలరా3 – సత్య కోసం ఎదురుచూస్తుంటారు
Filmy Bowl Rating: 3/5

Follow us on Instagram

Related posts

సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

‘జనక అయితే గనక’ రివ్యూ: కామెడీ కోర్ట్ రూమ్ కథ

filmybowl

దేవర మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

Leave a Comment