MOVIE NEWS

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్.ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి ‘దబిడి దిబిడి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఊర్వశి రౌతెలాతో బాలయ్య మాస్ స్టెప్స్ వేశారు…

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

ఈ సాంగ్ విడుదల కాకముందు దీనిపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలయిన తర్వాత కూడా సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్సే లభించింది. కానీ లిరికల్ వీడియోకు మాత్రమే విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి కారణం బాలయ్య, ఊర్వశి కలిసి వేసిన స్టెప్పులే. వాటిపై ప్రేక్షకులు రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.మామూలుగా బాలయ్య వేసే స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కొరియోగ్రాఫర్స్ స్టెప్స్ కంపోజ్ చేస్తేనే అవి స్క్రీన్‌పై అందంగా కనిపిస్తాయి.

కానీ ‘దబిడి దిబిడి’ విషయంలో అలా జరగలేదు. ఊర్వశి రౌతెలా స్పీడ్‌ను మ్యాచ్ చేస్తూ డ్యాన్స్ చేయడానికి బాలయ్య కష్టపడినట్లు అనిపించింది.ఓ సీనియర్ హీరో అయ్యిండి హీరోయిన్‌తో అలాంటి దారుణమైన స్టెప్పులు వేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..ప్రస్తుతానికి ‘దబిడి దిబిడి’కి సంబంధించిన లిరికల్ వీడియో మాత్రమే బయటికొచ్చింది. ఇక ఫుల్ వీడియో సాంగ్ విడుదలయితే ఇంక ఏ రేంజ్‌లో నెగిటివిటీ వస్తుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సీనియర్ హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా స్టెప్స్ కంపోజ్ చేయడం డ్యాన్స్ మాస్టర్ బాధ్యత అని ఇలాంటి స్టెప్స్ ఎందుకు చేయిస్తారో అని ప్రేక్షకులు శేఖర్ మాస్టర్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.

Related posts

కొండ దేవర సాంగ్ కి ఊహించని రెస్పాన్స్.. సినిమాకే కీలకం కానుందా..?

murali

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!!

murali

Leave a Comment