Mass ka Daas Mechanic Rocky Trailer Review
VIDEOS

మెకానిక్ రాకీ’ ట్రైలర్ టాక్: మరో మాస్ మసాలా ఎంటర్టైనర్

Mass ka Daas Mechanic Rocky Trailer Review
Mass ka Daas Mechanic Rocky Trailer Review

Mechanic Rocky Trailer Review : మాస్ కా దాస్‌ హీరో విశ్వక్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రo ద్వారా రవితేజ ముళ్లపూడి ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ అయినా ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీ గా ఉంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయినా టీజ‌ర్‌, సాంగ్స్ జనాలను భాగానే ఆక‌ట్టుకున్నాయి. తాజాగా మెకానిక్ రాకీ ట్రైలర్ 1.0 ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఎలా వుందో చూద్దాం పదండి.

ఫన్నీ డైలాగ్స్ తో తండ్రి కొడుకుల మధ్య జరిగే సంబాషణతో ఈ ట్రైలర్ ను ఓపెన్ చేసారు ”నువ్వు ఏం ఫికర్ చెయ్యకు నాన్నా.. ఎట్లయినా నేను సివిల్ ఇంజ‌నీర్‌ అయిపోతా” అంటూ విశ్వ‌క్ సేన్ అంటుండగా.. ”ఏంటి, కంప్యూట‌ర్ సైన్స్ చదివి సివిల్ ఇంజినీర్ అవుతా?” అంటూ సీనియర్ న‌రేశ్ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంటాడు.

అక్కడి నుంచి మోస్ట్లీ ఫన్నీ సీన్స్ తో ఆకట్టుకునేలా ట్రైలర్ ను నింపేశారు. మెకానిక్ షెడ్ నిర్వహించే నరేశ్.. తన కొడుకు రాకీ ఎందుకు పనికి రాడని అంటూ, చివరకు డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలు విశ్వక్‍ కు ఇస్తాడు.

ఇక హీరోయిన్స్ నీ
విశ్వక్ దగ్గరకు డ్రైవింగ్ నేర్చుకోడానికి వచ్చే వాళ్ళ లాగ శ్రద్ధా శ్రీనాథ్‍, మీనాక్షి చౌదరి పరిచయం చేశాడు. శ్రద్ధాకి డ్రైవింగ్ నేర్పించడం లో మాత్రం చిరాకు పడే మన మెకానిక్ రాకీ మరో హీరోయిన్ అయినా మీనాక్షికి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ నేర్పిస్తానంటూ లవ్ ట్రాక్ ఎక్కించడానికి తెగ ట్రై చేస్తుంటాడు.

ఏదొక వంకతో ఆమెను తాకడం.. గిఫ్టులు ఇవ్వడం వంటివి చేస్తూ ఇంప్రెస్ చెయ్యాలని చూస్తుంటాడు. ఆఖరికి అంబేద్కర్ జయంతికి కూడా ఆమెకు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్స్ చేయాలని చూస్తాడు. అయితే ట్రైలర్ శ్రద్ధా శ్రీనాథ్‍ ను విశ్వక్ కిస్ చేయడానికి ట్రై చేస్తుండటం చూస్తే, వీరి మధ్య కూడా లవ్ ట్రాక్ ఉందేమో అనే సందేహం కలుగుతుంది. ముక్కోణపు ప్రేమ కథ లాగ అనిపిస్తుంది.

కమెడియన్ సునీల్ నీ మరోసారి విలన్ గా పెట్టుకున్నారు. అతని ఎంట్రీ తోనే ట్రైలర్ యాక్షన్ మోడ్ లోకి టర్న్ అవుతుంది. మెకానిక్ షెడ్‍ స్థలం విషయంలో నరేష్ కి, సునీల్ కి మధ్య ఏదో సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది.

షెడ్ స్థలం కోసమే హీరో – విలన్ మధ్య గొడవ మొదలవుతుంది. అక్కడి నుంచి రంగంలోకి దిగిన విశ్వక్ తనదైన శైలిలో మాస్ డైలాగ్స్ చెబుతూ, యాక్షన్ సీన్స్ తో మాస్ నీ మెప్పించాడు.

‘రిపేరుకు వస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా.. సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా. అంతకు మించి మొండికి వేస్తే మాత్రం ఒక్కొక్కడి ఇంజిన్ తీసి బిగిస్తా’
‘నువ్వు రంకి రెడ్డి అయితే నేను రంకు రెడ్డి’ అంటూ సునీల్‍ కు విశ్వక్ మాస్ వార్నింగ్ ఇస్తాడు.

Read Also : ఒకే స్టేజ్ పైకి పాన్ ఇండియా హీరోలు….

మొత్తం మీద ట్రైలర్ నీ పక్కా మాస్ మసాలా గా ‘మెకానిక్ రాకీ’ సినిమాలో ఎంత మాస్ ఉంటదో ట్రైలర్1.0 తోనే ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చేసారు.

విశ్వక్ ఎప్పటిలాగే తన మార్క్ డైలాగ్స్ తో, కామెడీతో , ఫైట్ సీక్వెన్స్ లు భాగానే చేశాడు. శ్రద్ధా శ్రీనాథ్ ఈ తరం అమ్మాయిగా కనిపించగా.. మీనాక్షి చౌదరి ట్రెడిషనల్ గా కనిపించింది. ఇకఆ పాత్రల్లో హర్ష వర్ధన్, వైవా హర్ష కనిపించారు. సునీల్ మరోసారి తన విలనీతో మెరిశారు. ట్రైలర్ లో వినిపించిన బ్యాగ్రౌండ్ సినిమా మూడ్ కి తగ్గట్టు ఆకట్టుకుంది

‘మెకానిక్ రాకీ’ సినిమాని రామ్ తాళ్లూరి సమర్పణలో SRT ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సరిపోదా శనివారం ఫేమ్
జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అన్వర్ అలీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

ముందుగా ఈ సినిమాని దీపావ‌ళి కానుక‌గా అక్టోబరు 31 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ 2024 నవంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Follow us on Instagram 

Related posts

రా మచ్చా రా ఫుల్ సాంగ్ వచ్చేసింది….

filmybowl

రిలీజ్ ఐన వేట్టయన్ ట్రైలర్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్…

filmybowl

అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్

filmybowl

Leave a Comment