MOVIE NEWS

మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఐదు పదుల వయసు వున్న ఇంకా అదే ఎనర్జీతో రవితేజ సినిమాలు చేస్తున్నాడు.. అయితే ప్రస్తుతం రవితేజ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఆ తరువాత వచ్చిన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!!

ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా తన 75 వ సినిమాను భాను భోగవరపు డైరెక్షన్‌లో చేస్తున్నాడు.. ఈ సినిమాకు ‘మాస్ జాతర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టడం జరిగింది.. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది..ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మే9న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. రవితేజ పుట్టిన రోజు(జనవరి 26న) కానుకగా ఈ సినిమా నుంచి సాలీడ్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. బర్త్‌డే స్పెషల్‌లో భాగంగా టీజర్‌ కట్‌ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

 

Related posts

డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..?

murali

పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

filmybowl

ఫౌజీ : ఊహించని పాత్రలో ప్రభాస్..హనురాఘవపూడి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

murali

Leave a Comment