టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ “మాస్ జాతర”…మనదే ఇదంతా.. అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!!
రవితేజ నటనలో ఉండే ఎనర్జీ, టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది..నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో అదిరిపోయింది.వింటేజ్ మాస్ రవితేజని సినిమాలో చూస్తారని మేకర్స్ ప్రకటించారు. మాస్ ఎలివేషన్స్, పోలీసాఫీసర్ గా యాక్షన్ సీన్స్ తో పాటు రవితేజ కామిక్ టైమింగ్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చూపించారు..ఈ సినిమాతో రవితేజ మాస్ కంబ్యాక్ గ్యారెంటీ అని తెలుస్తుంది..