ఆర్ఎక్స్ 100 సినిమాతో యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి సంచలనం సృష్టించాడు.. బోల్డ్ అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఆ సినిమాతోనే హీరో కార్తికేయ హీరోయిన్ పాయల్ రాజపుత్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ఆర్ఎక్స్ 100 సినిమాలో నటి పాయల్ రాజపుత్ బోల్డ్ కనిపిస్తూనే నెగటివ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టింది.. ఆ సినిమాతో పాయల్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి.. కానీ అవేమి ఆమెకు భారీ హిట్ అయితే ఇవ్వలేకపోయాయి.. దీనితో మళ్ళీ ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మంగళవారం’ సినిమాలో పాయల్ లీడ్ రోల్ లో నటించింది..ఈ మూవీ 2023లో రిలీజై, సెన్సేషన్ క్రియేట్ చేసింది.
వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!!
ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి..తాజాగా ఈ సీక్వెల్ కోసం ఓ క్రేజీ హీరోయిన్ ని మేకర్స్ సెలెక్ట్ చేశారనే న్యూస్ వైరల్ గా మారింది.’మంగళవారం’ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలలో నటించారు..సరికొత్త పాయింట్ తో రూపొందిన ఈ సినిమాలో అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించింది. అలాగే పాయల్ రాజ్ పుత్ అన్ బీటబుల్ పెర్ఫార్మన్స్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘మంగళవారం 2’ కోసం మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది..
ఇప్పటికే అజయ్ భూపతి ‘మంగళవారం 2’ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయగా, త్వరలోనే షూటింగ్ కూడా షురూ చేయనున్నట్లు సమాచారం..ఇదిలా ఉంటే ‘మంగళవారం 2’ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కనిపించబోదని తెలుస్తోంది. ఆమె ప్లేస్ ని యంగ్ హీరోయిన్ శ్రీలీల రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం… ప్రస్తుతం మేకర్స్ శ్రీలీలతో సంప్రదింపులు జరుపుతుండగా, త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.