Mangalavaram Movie directors next kept on hold again
MOVIE NEWS

మంగళవారం డైరెక్టర్ కే ఎందుకిలా….

Mangalavaram Movie directors next kept on hold again
Mangalavaram Movie directors next kept on hold again

Mangalavaram Movie : అజయ్ భూపతి టాలీవుడ్ టాలెంటెడ్ లిస్ట్ ఆఫ్ దర్శకుల పేర్లు తీస్తే ఇతని పేరు కత్చితంగా వుంటుంది. కానీ ఎందుకో సరైన కాంబినేషన్ సినిమా నే కుదరట్లేదు. తీసింది మూడు సినిమాలే అయినా యూత్ లో మాంచి అభిమానం తెచ్చుకున్న దర్శకుడు.

‘ఆర్ ఎక్స్ 100’, ‘మహా సముద్రం’, ‘మంగళవారం’ సినిమాలతో దర్శకుడిగా తన టాలెంట్ ఎంతో అందరికీ పరిచయం చేసిన అజయ్ భూపతి నెక్స్ట్ సినిమా కోసం కథ సిద్ధం చేసుకుంటున్నారు.

పాయల్ రాజ్ పుట్ తోనే ‘మంగళవారం’ సీక్వెల్ ని ఇప్పటికే అజయ్ భూపతి ఎనౌన్స్ చేశారు. కానీ మధ్యలో అనుకోకుండా చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు.

పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తియ్యాలని ప్లాన్ చేశారు. స్టార్ట్ నారేషన్, మిగతా అన్ని ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అనే ప్రచారం నడిచింది.

కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. ఇద్దరి మధ్య స్టోరీ చర్చలు చాలా సార్లు జరిగాయి. విక్రమ్ కి కూడ కథ
వినిపించడం ఆయనకి కూడా నచ్చిందట.
అయితే ఫైనల్ గా మూవీ మాత్రం సెట్ కాలేదని తెలుస్తోంది.

ధృవ్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ రిజక్ట్ చేశారనేది క్లారిటీ రావడం లేదు. ధృవ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు చేసేది లేక అజయ్ భూపతి మరొక హీరోని వెతికే పనిలో ఉన్నాడంట.

అజయ్ భూపతి కి ఇది మొదటి సారి కాదు RX 100 ఘన విజయం సాధించాక మాస్ మహారాజా రవితేజ త్ ఒక సినిమా ఓకే అయింది ఇక స్టార్ట్ చేయడమే అనుకున్నప్పుడు ఆగిపోయింది. దాని మీద హీరో, దర్శకులు సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ కూడా చేసుకున్నారు అది వేరే విషయం అనుకోండి. మరల ఇప్పుడు అదే రిపీట్ అయింది.

Read Also : అఖండ 2 తాండవం…. అదరహో…

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయంపైనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ధృవ్ తో ప్రాజెక్ట్ హోల్డ్ అయింది కాబట్టి వేరే హీరో దగ్గరికి వెళ్తాడా లేక ‘మంగళవారం’ సీక్వెల్ ని అజయ్ భూపతి స్టార్ట్ చేస్తాడా చూడాలి.

ఏది ఏమైనా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు
తెచ్చుకున్న తర్వాత కూడా అజయ్ భూపతి ప్రతి సినిమా కి లాంగ్ గ్యాప్ రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అజయ్ భూపతి తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనే దాని కోసం ఆయన సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు.

ఏదైనా ఒక స్టార్ హీరోతో సరైన మూవీ పడితే అజయ్ కి కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వస్తుందని ఎదురుచూస్తున్నారు. చూడాలి ఎప్పుడు ఆ లక్ ఈ దర్శకుడి ఇంటి తలుపు తట్టిద్దో.

Follow us on Instagram

Related posts

‘జై హనుమాన్’ లో నటించేది ఆ దర్శకుడేనా????

filmybowl

వెర్షన్స్ మారుస్తున్న సుకుమార్.. హీరో పాత్రలపై భారీ ప్రయోగాలు..!!

murali

మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా?

filmybowl

Leave a Comment