మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ కన్నప్ప “ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.. కన్నప్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది.. మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రలను అన్నీ ఇండస్ట్రీ ల స్టార్స్ చేత నటింపజేశాడు.. మలయాళం నుంచి సూపర్ స్టార్ మోహన్ లాల్ ను అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, టాలీవుడ్ నుంచి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ప్రభాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాలో రుద్ర పాత్ర చేసినందుకు ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోకపోవడం విశేషం. కన్నప్ప లో రోల్ కోసం ప్రభాస్ అడిగిన వెంటనే ఒప్పుకోవడంతో ప్రభాస్ , విష్ణు మధ్య స్నేహం మరింత పెరిగింది..ప్రభాస్ క్యామియోతో కన్నప్ప రేంజ్ బాగా పెరిగింది..అలాగే ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ చేస్తుండటంతో బాలీవుడ్ లో సైతం కన్నప్ప కి సూపర్ క్రేజ్ ఏర్పడింది.
ఖరీదైన కారుతో తమన్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!!
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో “స్పిరిట్ “ అనే భారీ మూవీ తెరకెక్కుతుంది.. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా కోసం ఇటీవలే చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో రోల్స్ కోసం అన్ని వయసుల వారు అప్లై చేసుకోవచ్చని, రెండు నిమిషాల వీడియోతో పాటు ఫోటోలు ఇతర వివరాలు పంపిస్తే ఆడిషన్ కి ఎంపిక చేస్తామని భద్రకాళి పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
ఇప్పటికే ఆ సంస్థకు కొన్ని లక్షల మెయిల్స్ వచ్చి ఉంటాయి కానీ ఇప్పుడీ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. మంచు విష్ణు అఫీషియల్ గా దీని గురించి చెబుతూ నేను కూడా స్పిరిట్ సినిమా కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, చూద్దాం ఏం జరుగుతుందోనంటూ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Yo! I applied. Now let’s wait and see 💪🏽🥰 https://t.co/PXNOPrl5aS
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2025