MOVIE NEWS

ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్స్..నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర’..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది.కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 550 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు..ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీ అయిపోయాడు ఎన్టీఆర్‌. మరోవైపు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన రంగం సిద్ధం అవుతోంది.

గేమ్ ఛేంజర్ : ప్రమోషన్స్ కి దూరంగా కియారా.. కారణం అదేనా..?

సంక్రాంతి తరవాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని సమాచారం…ఈ సినిమాలో హీరోయిన్ గా ‘సప్త సాగరాలు దాటి’ భామ రుక్మిణి వసంత్ నటిస్తోంది. మరో హీరోయిన్ గా రష్మికని తీసుకునే ఛాన్స్ వుందని సమాచారం.అయితే ఈ సినిమాలో ఇద్దరు మలయాళ స్టార్స్ నటిస్తున్నట్లు సమాచారం. ఒకరు బీజూ మీనన్‌, మరొకరు టొవినో థామస్‌. మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్స్ అయిన వీరిద్దరి రాకతో ఈ సినిమాపై మరింత హైప్ రానుంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మైత్రీ మూవీస్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి.ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే పేరు మేకర్స్ పరిశీలిస్తున్నారు.ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ వున్నారు..ఈ యేడాది ఆగష్టు లో ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా రాబోతోంది. వార్ 2 వచ్చిన మరో నాలుగు నెలల తరవాత ప్రశాంత్ నీల్ సినిమా వస్తుంది.

Related posts

చరణ్ మీద ఎంతో భారం…. మోస్తాడంటారా…

filmybowl

స్పిరిట్ : టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!!

murali

Leave a Comment