MOVIE NEWS

లుక్ చేంజ్ చేసిన మహేష్..రాజమౌళి సినిమా హోల్డ్ లో పడిందా ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.”ఎస్ఎస్ఎంబి” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేసాడు .

ఈ సినిమా కథ అంతా కూడా ఆఫ్రికా అడవుల్లో బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ పూర్తిగా మార్చుకున్నాడు.లాంగ్ హెయిర్ ,గుబురు గడ్డంతో కనిపించి అందరించి ఆశ్చర్యపరిచాడు.మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ సినిమాకు సంబంధించి అద్భుతమైన లొకేషన్స్ కోసం రాజమౌళి వేట కొనసాగిస్తున్నారు.

చరిత్రలో నిలిచిపోయే పాత్రలో అల్లుఅర్జున్ ..బన్నీపై త్రివిక్రమ్ భారీ ప్రయోగం ..?

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయిన తరువాత ఓ గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు.అయితే మహేష్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.జీసస్ క్రీస్తుతో పోలుస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మహేష్ తన లుక్ చేంజ్ చేసాడు.ఇంతకు ముందు గుబురు గడ్డంతో కనిపించిన మహేష్ ప్రస్తుతం గడ్డం ట్రిమ్ చేసుకొని మ్యాన్లీ లుక్ లో కనిపించాడు.అయితే మహేష్ లుక్ చేంజ్ చేయడంతో మహేష్ రాజమౌళి సినిమా కంటే ముందు మరో సినిమా చేయనున్నాడని ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

Related posts

సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ”

murali

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

murali

బాలయ్య, ఎన్టీఆర్ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!

murali

Leave a Comment