టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “ఎస్ఎస్ఎంబీ 29”..ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఆర్ఆర్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అలాగే సూపర్ స్టార్ మహేష్ హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. బిగ్గెస్ట్ అడ్వంచరస్ కథతో రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలోని తన పాత్ర కోసం మహేష్ కొంత ట్రైనింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అదేశాల మేరకు జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి..
ఫారెన్ వీధుల్లో సామాన్యుడిలా ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!
ఆఫ్రికాలోని మసాయి-పిగ్మీస్ తెగల మధ్య బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఓ 20 రోజుల పాటు ఆప్రికన్ తెగల మధ్య మహేష్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా మహేష్ చైనా దేశానికి కూడా వెళ్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..సినిమాకి సంబంధించి మార్షల్ ఆర్స్ట్ పై కూడా బేసిక్ ట్రైనింగ్ అసవరమని భావించిన దర్శకుడు రాజమౌళి మహేష్ ను చైనాకి పంపిస్తున్నాడుట. ఈనెల మధ్యలో మహేష్ చైనా వెళ్ళనున్నట్లు సమాచారం… అక్కడ స్పెషల్ ట్రైనర్ల ఆధ్వర్యంలోని ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం.. మహేష్ తో పాటు రాజమౌళి కూడా ఈ ట్రైనింగ్ సెషన్ కి అటెండ్ అవుతారని సమాచారం..
రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమం మేకర్స్ ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా పూర్తి చేసారు..ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెట్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.అన్నీ కుదిరితే మొదటి పార్ట్ 2027 లో రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయి..