MOVIE NEWS

ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది.. పెద్ద హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.. అయితే ఇండియన్ సినీ హిస్టరీ లో తెలుగు సినిమా ఖ్యాతి అమాంతం పెరగడంతో టాలీవుడ్ సీక్వెల్స్ ట్రెండ్ ఇప్పుడు దేశమంతా నడుస్తోంది..ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే చాలు,కచ్చితంగా రెండో భాగం ఉంటుంది.కానీ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ సీక్వెల్స్, ఫ్రాంచైజీల జోలికి వెళ్లని స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలంతా సీక్వెల్స్ లో భాగమయ్యారు.. కానీ మహేష్ మాత్రం ఈ ట్రెండ్ కు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మహేష్ సైతం సీక్వెల్స్ లో భాగం కాబోతున్నట్లు సమాచారం.

మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..?

మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమా లో నటిస్తున్నాడు. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది…ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీని వచ్చే ఏడాది జనవరిలో పూజా కార్యక్రమాల తో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం .

అంతేకాదు మహేష్ బాబు సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించడానికి రాజమౌళి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.ఫస్ట్ పార్ట్ ని 2027 లో, సెకండ్ పార్ట్ ని 2029 లో విడుదల చేసే విధంగా పర్ఫెక్ట్ ప్లాన్ గీసుకున్నట్లు తెలుస్తుంది.. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది..ఇంకో ఐదేళ్లు మహేష్ రాజమౌళి జైల్లో గడపాల్సిందే.. మహేష్ ఫ్యాన్స్ కి ఇది చేదు వార్తే అయిన ప్రపంచం గర్వించదగ్గ సినిమా వస్తుందని సంతోషిస్తున్నారు

Related posts

రాంచరణ్ : ఆ విషయంలో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు..!!

murali

చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!

murali

గేమ్ ఛేంజర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్స్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

Leave a Comment