MOVIE NEWS

మహేష్ సినిమా కోసం రంగంలోకి మరో స్టార్ ప్రొడ్యూసర్.. జక్కన్న ప్లానింగ్ అదిరిందిగా..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని చేంజ్ చేసుకునే పనిలో వున్నాడు.ఇటీవల లాంగ్ హెయిర్ ,గుబురు గడ్డంతో కనిపించిన మహేష్ తాజాగా గడ్డం ట్రిమ్ చేయించుకొని మ్యాన్లీ లుక్ లో కనిపించాడు.ఈ సినిమాలో మహేష్ లుక్ ని రాజమౌళి ఇంకా ఫైనల్ చేయలేదు.

ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేయగా రాజమౌళి కథకు షూట్ అయ్యే లొకేషన్స్ కోసం వేట కొనసాగిస్తున్నాడు.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ అప్డేట్ కావాలని ఫ్యాన్స్ రాజమౌళికు తెగ మెసేజెస్ చేస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా వున్న రాజమౌళి త్వరలోనే ఓ భారీ ప్రెస్ ఏర్పాటు చేసి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియజేయనున్నట్లు సమాచారం.

రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమా నిర్మాణంలో మరో మాస్టర్ మైండ్ కూడా చేరబోతున్నట్టు సమాచారం.రాజమౌళి ఆయనకు కార్యనిర్వాహక నిర్మాతగా ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు సమాచారం.ఆయన ఎవరో కాదు ..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో నిర్మాతగానే కాకుండా మార్కెటింగ్ లో కూడా కీలక పాత్ర పోషించిన శోభు యార్లగడ్డ.. RRR ఆస్కార్ నామినేషన్ కు సంబంధించి ప్రాసెస్ అంతా ఈయనే దగ్గరుండి చూసుకున్నారు.దీనితో మహేష్ సినిమాకు కూడా పని చేయాల్సిందిగా ఆయనని రాజమౌళి కోరినట్లు సమాచారం.దీనితో మహేష్ సినిమాకు మరింత అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారట.

Related posts

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

murali

డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

murali

Leave a Comment