MOVIE NEWS

ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “అతడు” మంచి విజయం సాధించింది.. ఇంటిల్లపాది కలిసి చూసే ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది.. థియేటర్ లోనే కాకుండా టీవీల్లో సైతం అతడు సినిమా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘ఖలేజా’.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.. కానీ మొదట ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.. ఆ తరువాత కొన్నాళ్లకి ఈ సినిమా ట్రెండింగ్ గా నిలిచింది..

ఇదిలా ఉంటే తాజాగా ‘ఖలేజా’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నెల 30న ఈ సినిమా రీ రిలీజ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ ను టీం విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.అయితే ‘అతడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే.. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలగలిపి తెరకెక్కించిన ఈ మూవీ మహేష్ కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచింది. టైటిల్ వివాదాలతో ‘మహేష్ ఖలేజా’ పేరుతో 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతకు నష్టాలు మిగిలాయి..

పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

కానీ..తర్వాత రోజుల్లో ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని కామెడీ యాంగిల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో అంతే క్రేజ్ ఉంటుందనే దృష్టిలో ఉంచుకుని ఈ మూవీని రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా మూవీని ఈ నెల 30న రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Related posts

అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!!

murali

పెద్ది : ఫస్ట్ షాట్ తో పాటు, రిలీజ్ డేట్ గ్లింప్స్.. స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

murali

SSMB : సరికొత్త మహేష్ ని చూస్తారు.. విజయేంద్రప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment