MOVIE NEWS

మ్యాడ్ స్క్వేర్ : మరోసారి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. టీజర్ అదిరిపోయిందిగా..!!

టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాడ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మ్యాడ్ మూవీ 2023 అక్టోబర్ 6 న రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది.ఈ ఫన్నీ ఎంటర్టైనర్ మ్యాడ్ మూవీకి సీక్వెల్‌ ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు..”మ్యాడ్ స్క్వేర్ “ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ లపై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా “ స్వాతి రెడ్డి “ సాంగ్ ఫుల్ పాపులర్ అయింది..

అనిల్ రావిపూడి సినిమా లో మెగాస్టార్ రోల్ పై బిగ్ అప్డేట్..?

రెబా మోనిక ఈ సాంగ్ లో తన సూపర్ స్టెప్స్ తో అదరగొట్టింది..స్వాతి రెడ్డి సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ ని షేక్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.భీమ్స్ సిసిరోలియో మరో సారి తన రాకింగ్ మ్యూజిక్ తో అదరగొట్టేందుకు సిద్ధం అయ్యాడు..ఈ సినిమాను మేకర్స్ మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు..టీజర్ ఆద్యంతం ఎంతో ఫన్నీగా సాగింది..నార్నె నితిన్‌, రామ్ నితిన్‌, సంగీత్ శోభన్‌లు మరోసారి తమ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.ఈ ఏడాది నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ ఫన్ రైడ్ గ్యారెంటీ అని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా వున్నారు..

 

Related posts

ఒకే టైటిల్ తో ఇద్దరి హీరోల మూవీస్.. ఒకే రోజు అనౌన్స్మెంట్..!!

murali

నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..?

murali

దేవర ని హైలెట్ చేయనున్న సీన్స్ ఏంటి ?

filmybowl

Leave a Comment