MOVIE NEWS

భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!!

తెలుగు ప్రేక్షకులకి కామెడీ చిత్రాలంటే ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం కామెడీ కంటెంట్ వున్న సినిమాలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి.. అవి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు..కేవలం కామెడీ ప్రాధన్యతగా తీసిన సినిమాలలో ప్రేక్షకులు సరికొత్త ఫన్ కోరుకుంటారు.. కొత్త డైరెక్టర్స్ కామెడీ ట్రాక్స్ రాయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ ఆ కోవలోకి వచ్చిందే.. నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2023లో విడుదలయి మంచి విజయం సాధించింది.. ఈ సినిమాలో కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. యూత్ కి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది..

ఆదిత్య 369 : కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్.. తగ్గేదిలేదంటున్న బాలయ్య..!!

తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మేకర్స్ సీక్వెల్ రూపొందించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ కామెడీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు..మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టింది..

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ప్రపంచవ్యాప్తం గా మొత్తం 21 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ అయింది..అయితే, ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 55 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు సమాచారం..తాజా వసూళ్ల ప్రకారం దాదాపు 25 నుంచి 30 కోట్ల షేర్ వచ్చి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తే ఈ సినిమాకు మరిన్ని భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం వుంది..

 

Related posts

పుష్ప 2 : దర్శకుడు సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!!

murali

ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు…

filmybowl

Leave a Comment