MOVIE NEWS

మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ ఫన్ ఎంటర్టైనర్ “మ్యాడ్” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2023 అక్టోబర్ 6 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది..ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరోసారి ఈ సీక్వెల్ లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

‘వార్ 2’ కోసం మళ్ళీ ముంబైకి ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

2025, మార్చి 29న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా మార్చి 28న రిలీజ్ కానున్న క్రమంలో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆ రోజు పవర్ స్టార్ సినిమా వస్తే మా సినిమా రిలీజ్ చేయమని ఆయన అన్నారు. “మంచి సినిమా తీశాము. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని నాగ వంశీ తెలిపారు… రెండు గంటల పాటు స్ట్రెస్ ని అంతా పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి అని నాగవంశీ తెలిపారు..

 

Related posts

పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!!

murali

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

murali

“కాంచన 4” మొదలెట్టిన లారెన్స్.. ఈ సారి మరింత కొత్తగా..!!

murali

Leave a Comment