Maa Nanna Super hero Movie Trailer Released
VIDEOS

మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్

Maa Nanna Super hero Movie Trailer Released
Maa Nanna Super hero Movie Trailer Released

Maa Nanna Super hero : డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ వరుసగా సినిమాలను చేస్తూ అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలనే నమ్ముకొని అదే పంథాలో వెళుతున్న సుధీర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

2024లో హరోం హర సినిమా తో ప్రేక్షకులని పలకరించిన ఆయన.. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ మన ముందుకి రానున్నాడు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వ‌హిస్తున్న ee సినిమాలో ఆర్ణ కథానాయికగా నటిస్తున్నారు.

దసరాని పురస్కరించుకొని అక్టోబర్ 11వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు నిర్మాత ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ లో టీం బిజీ అయిపోయింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా
సినిమా ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి ట్రేండింగ్ తో వ్యూస్ అందుకుంటున్న ట్రైలర్.. టీజర్ ను మించిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయిందని కామన్ ఆడియన్స్ చెబుతున్నారు.

“ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకును నాకు దూరం చేసింది. దాని విలువ 25 సంవత్సరాలు”
అంటూ ఫిదా ఫేమ్ సాయి చంద్ చెప్పిన డైలాగ్‌‌ ‌తో ట్రైలర్ ఓపెన్ అయింది.

డ‌బ్బు కోసం పుట్టగానే తన కొడుకు (సుధీర్ బాబు)ను తండ్రి (సాయి చంద్) అమ్ముకుంటాడు అన్నట్టు అర్ధం అవుతుంది. ఆ తర్వాత సీన్ లో షాయాజీ షిండే…. సుధీర్ బాబు కి తండ్రి గా కనిపిస్తాడు బహుశా

జ‌న్మ ఇవ్వ‌లేక‌పోయినా సుధీర్ బాబును త‌న కొడుకుగా పెంచుకుంటాడు షాయాజీ షిండే. ఆయన ఓ విషయంలో జైలు పాలవుతాడు. అప్పుడే కొడుకు కోసం 25 ఏళ్ల త‌ర్వాత సాయి చంద్ మళ్ళి తిరిగి వస్తాడు.

అయితే తన కన్న తండ్రి తిరిగి వచ్చాక సుధీర్ పరిస్థితి ఏంటి? పెంచిన తండ్రి జైలు పాలవ్వడంతో హీరో అతని కోసం ఎం చేశాడు? బయటకు తీసుకొచ్చాడా? అన్న విషయాల కోసం సినిమా చూడాల్సిందే.

Read Also : OG పెద్ద రేంజ్ హిట్ అవుతుంది – ఎస్ ఎస్ థమన్

ట్రైలర్ లో డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా, మంచి డెప్త్ తో ఉన్నాయి. సుధీర్ బాబుతో పాటు ఆయనను పెంచిన తండ్రి, కన్న తండ్రి పాత్రల్లో నటించిన షాయాజీ షిండే, సాయి చంద్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

ట్రైలర్ చివర్లో మహేష్ బాబు రిఫరెన్స్ కూడా యాడ్ చేయడం అభిమానులకి నచ్చే అంశమే. మొత్తంగా ట్రైలర్ అందరినీ నచేసిద్ధి అలానే సినిమాపై హోప్స్ పెంచేస్తుంది.

తండ్రీకొడుకుల సెంటిమెంట్‌, హ్యూమన్ ఎమోషన్స్ తో మూవీ రాబోతుండగా.. సుధీర్ పక్కాగా హిట్ ఈసారి తన ఖాతాలో వేసుకుంటాడని అంతా ధీమాగా ఉన్నారు

సీఏఎమ్‌ ఎంటర్టైన్మెంట్స్‌, వీ సెల్యులాయిడ్స్‌ కలిసి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరి మా నాన్న సూపర్ హీరో మూవీ మీదున్న అంచనాలని అందుకొని ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

 

Follow us on Instagram

Related posts

మిస్టర్ ఇడియట్ ట్రైలర్ రిలీజ్

filmybowl

మట్కా టీజర్ ఎలా వుందంటే….

filmybowl

విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది…

filmybowl

Leave a Comment