MOVIE NEWS

మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..?

తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చేసింది తక్కువ సినిమాలే కానీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసాడు.. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లోకేష్ యాక్షన్ సినిమాలకు ఎంతో ఫేమస్.. లోకేష్ కనగరాజ్ “ఎల్‌సీయూ” అనే సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.లోకేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు ఎల్‌సీయూలో భాగంగా తెరకెక్కినవే…. త్వరలోనే లోకేష్ ఎల్‌సీయూలో భాగంగా మరిన్ని సినిమాలు తెరకెక్కనున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు”కూలీ” అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేసారు.

తన నెక్స్ట్ మూవీపై సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..?

ఈ సినిమా తొలి దశ షూటింగ్ చెన్నై, కర్ణాటకలో జరగగా. మిగిలిన భాగం ఉత్తరాది రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత లోకేష్ నిర్మాతగా మారాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ నటిస్తున్న ‘బెంజ్’అనే సినిమాని  లోకేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎల్‌సీయూలో కలపబోతున్నట్లు లోకేష్ తెలిపాడు… భాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతుంది… ఈ సినిమాకు సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం ఓ స్టార్ హీరోని లోకేష్ ఎంపిక చేసినట్లు సమాచారం..

ఆ స్టార్ హీరో మరెవరో కాదు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.లోకేష్ తాను తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో సూర్య ను విలన్ గా చూపించాడు.. రోలెక్స్ అనే పాత్రలో కనిపించి సూర్య సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.అలాగే ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న కూలి సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటుందని సమాచారం… అలాగే బెంజ్‌ సినిమా లో మాధవన్ ను పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం..దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

Related posts

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

murali

గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

filmybowl

రాబోయే పదేళ్లలో సుకుమార్ చేసేది కేవలం 3 సినిమాలేనా..?

murali

Leave a Comment