Ram charan Boxoffice : ఏ సినిమా ఐనా హిట్ అయితే ఆ సినిమా లో నటించిన ప్రతి ఒక్కళ్ళకి మార్కెట్ పెరిగింది. ఇక ఆ సినిమా హీరో, దర్శకుల గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు వాళ్ళ స్థాయి అమాంతం పెరిగిపోతుంది దానికి నిదర్శనం ఎన్టీఆర్.
‘RRR’ అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్‌ను ఎంతలా పెంచిందో ‘దేవర’ సినిమాతో రుజువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్, మార్కెట్ ఎంతో పెరిగింది.
ఓపెనింగ్స్ తో దుమ్ముదులిపేసిన ‘దేవర’ హిట్ స్టేటస్ అందుకోడానికి ఇంకా 15 కోట్ల రూపాయిల దూరం లో ఉంది ఎలాగూ వచ్చేది హాలిడేస్ సీసన్ ఏ కాబట్టి సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచిద్ది.
ఇక దేవర సంగతి అటు ఉంచితే ఇప్పుడు అందరి దృష్టి ‘RRR’లో మరో హీరోగా నటించిన రామ్ చరణ్ బాక్సాఫీస్ రేంజ్ ఎంత పెరిగిందో చూడాలని ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
‘RRR’ తర్వాత చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి కొరటాల దర్శకత్వం లో చేసిన సినిమా ‘ఆచార్య’. ఆ సినిమా డిసాస్టర్ గా నిలిచింది…. కాకాపోతే అది అతిథి పాత్ర. కాబట్టి బిజినెస్ పరంగా దాన్ని లెక్కలోకి తీసుకోలేము అనే వాదన ఉంది సో సోలో హీరోగా శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్‌తో చేసిన ‘గేమ్ చేంజర్’యే చరణ్ రేంజ్ కు పరీక్ష.
కానీ ఈ సినిమా మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ధానికి వివిధ కారణాలు ఉన్నాయి కానీ ప్రస్తుత పరిస్థితిలో చరణ్ ఈ భారాన్ని మొయ్యాల్సి ఉంది.
Read Also : Pushpa 2: పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో ఆ బ్లాక్ బస్టర్ హీరోయిన్
ఈ సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ అయుంటే.. రిసల్ట్ ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లి నాలుగేళ్లు అవ్వొస్తోంది. బడ్జెట్ ఎంత పెరిగింది వడ్డీలు ఎంత అనేది నిర్మాతకు తెలియాలి. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగా నిర్మాత సేఫ్ అవ్వాలంటే బిజినెస్ కూడా అంతే జరగాలి.
రాజు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నుంచి ఎంతో ప్లాన్ తో షూటింగ్ కి దిగేవాడు. ఎక్కడా పరిది ధాటి వెళ్లిన సందర్భాలు లేవు అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇన్నేళ్లు సినిమాలు తీయగాలిగాడు. అలాగే చరణ్ కెరీర్ లో కూడా ఇంత టైమ్ తీసుకున్న సినిమా లేదు
‘RRR’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సోలో సినిమా కాబట్టి బిజినెస్ బిజినెస్ ఈపాటికే క్లోజ్ అయి నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేసి ఉండాలి. కానీ మధ్యలో వచ్చిన ఆచార్య , ఇండియన్-2 పెద్ద డిజాస్టర్ లు కావడంతో దాని తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడి హైప్ కొంత తగ్గింది.
అనుకున్న బడ్జెట్ పెరిగిపోవడం తో నిర్మాత సేఫ్ అవ్వాలoటే థియేట్రికల్ హక్కులు ఎక్కువకే అమ్మాలి కానీ ఎక్కువ మొత్తం ఇవ్వడానికి బయర్స్ అంత ఆసక్తిగా లేరనేది ట్రేడ్ వర్గాల సమాచారం.
నిర్మాత , హీరో మీద నమ్మకం తో హై లెవెల్ లో బిజినెస్ జరిగినా ఈ చిత్రం అంత పెద్ద టార్గెట్ ని అందుకొని అందరికి లాభం చేకూర్చాలని ఆశిద్దాం.
Follow us on Instagram