Liger connection to VD12 : లైగర్ సినిమా పేరు ఎత్తితేనే దేవరకొండ తో పాటు దేవరకొండ అభిమానులు కి కూడా ఇక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకం అలాంటిది. ఆ సినిమా కోసం శారీరికంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డాడు. సినిమా మీద నమ్మకం తొ రిలీజ్ టైం లో పెద్ద స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. రిలీజ్ అయ్యాక అవి ట్రోల్ మెటీరియల్ లాగ మిగిలాయి. అందుకే ఆ సినిమా నీ ఎవరు తలుచుకోరు. మరి ఇప్పుడెందుకు లైగర్ టాపిక్ అనుకుంటున్నారా చదవండి ఐతే
కొన్ని విషయాల్లో ముందు చెడు జరిగిన దాని నుంచి ఏదోకటి మంచి జరుగుతుంది అంటుంటారు పెద్దలు.
లైగర్ విషయం లో అదే జరిగినట్టుంది. విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) లైగర్ సినిమాకు తీసుకున్న జాగ్రత్తలు ఎన్నో. అంతకుముందు వరకు అలాంటి స్పాన్ ఉన్న కమర్షియల్ జానర్ లో సినిమాలు తీయలేదు విజయ్.
అర్జున్ రెడ్డిలో యూత్ మాస్ యాంగిల్ టచ్ చేసినా యాక్షన్ అంశాలు పెద్దగా లేవు. కాబట్టి లైగర్ టైమ్ లో ప్రత్యేకంగా చెమటోడ్చి యాక్షన్ సీక్వెన్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు. జిమ్ లో ఫుల్ గా బాడీ పెంచాడు.
కానీ పూరి సినిమాని ఎందుకో అనుకున్న విధంగా తీయలేకపోయాడు. విజయ్ కష్టమంతా వృధా అయిపోయింది అని ఇండస్ట్రీ లో చాల రోజులే మాట్లాడుకున్నారు.
ఆ సినిమా ఫలితం అంచనాలను అందుకోకపోయినా విజయ్ కు మాత్రం అదొక పాఠమే.
ఇక ఇప్పుడు చేస్తున్నా VD12 కోసం కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. బాడీ నీ మళ్ళీ మౌల్డ్ చేస్తున్నాడట. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ నిర్మిస్తున్నాడు.
మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూ లో చిత్ర నిర్మాత వంశీ ఇది గౌతమ్ తీస్తున్న KGF అని మాట అన్నారు. ఆ మాటతో సినిమా కి ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఆ మాట తో ఈ సినిమాలో యాక్షన్ అంశాలు గట్టిగా ఉండనున్నట్లు తెలుస్తుంది.
Also Read : మున్నా భాయ్ 3 వచ్చే టైమ్ ఆసన్నమైంది – రాజ్ కుమార్ హిరాని
ఈ చిత్ర బృందం ప్రస్తుతం కేరళ – మున్నార్‌లో షూటింగ్ చేస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ చేతన్ రామ్షి డిసౌజా కంపోజ్ చేయగా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్‌ని పూర్తి చేసారు. అందులో విజయ్ ఫైట్స్ మాస్ నీ ఉర్రూతలూగించేలా ఊచకోత అనే మాటకి తీసిపోని విధంగా ఉంటాయట.
జెర్సీ సినిమాతో ఇప్పటికి మర్చిపోలేని ఎమోషనల్ మూమెంట్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ ఇప్పుడు ఈ చిత్రం లో కూడా అదే విధంగా మనసుకి హత్తుకునే సీన్స్ చాలనే ఇంక్లూడ్ చేసినట్టు చెప్తున్నారు.
వీటితో పాటు గౌతమ్ నుంచి యాక్షన్ సీన్స్ వస్తే ఎలా వుంటాయో అర్థం చేసుకోవచ్చు. విజయ్ లుక్ పరంగా కూడా ఇందులో చాల కొత్తగా ఇంకా చెప్పాలంటే వైల్డ్ గా కనిపిస్తున్నాడు. ఇక లైగర్ కోసం నేర్చుకున్న యాక్షన్ పాఠాలు విజయ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా వచ్చేలా కష్టపడుతున్నాడు. అతని కష్టానికి VD12 ద్వారా ఫలితం దక్కే అవకాశం ఉంది. మరి సినిమా కంటెంట్ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.
Follow us on Instagram