MOVIE NEWS

స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!!

మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఉగాది పండుగ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ సహా కీలక వ్యక్తుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా అనిల్ రావిపూడి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు..తాజాగా.. సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడి మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు.

సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

‘నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఆయనతో జర్నీ చేయడానికి మా టీమ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ సారి సౌండ్ మరింత పెంచాం.. రఫ్పాడిస్తాం’ అని అని రావిపూడి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్, గ్యాంగ్ లీడర్ రేంజ్ సినిమాలు కావాలి.. అస్సలు డిజప్పాయింట్ చేయొద్దు అంటూ అనిల్‌కు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. హీరోయిన్‌గా పరిణితి చోప్రా, అథితి రావు హైదరి ఎంపికయినట్లు న్యూస్ బాగా వైరల్ అవుతుంది..అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ తరువాత మొదలయ్యే ఛాన్స్ వుంది.ఈ గ్యాప్ లో మెగాస్టార్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ “ విశ్వంభర” పూర్తి చేయనున్నాడు.. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు..

Related posts

న్యూ ఇయర్ స్పెషల్ : కొత్త సినిమాల స్పెషల్ పోస్టర్స్ వైరల్..!!

murali

ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!!

murali

ప్రభాస్ ‘రాజసాబ్’ టీజర్ రన్ టైం లాక్..!!

murali

Leave a Comment