Le le raaja song from Matka - Nora Fathehi sizzles
VIDEOS

మట్కా నుంచి లే లే రాజా సాంగ్ విడుదల

Le le raaja song from Matka - Nora Fathehi sizzles
Le le raaja song from Matka – Nora Fathehi sizzles

Matka – Nora Fathehi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క అయితే రేపు నవంబర్ లో రాబోతున్న మట్కా సినిమా మరొక లెక్క లాగ ఉంది.

అనౌన్స్మెంట్ నుంచి ఈ సినిమా పై తెలుగు సినీ పరిశ్రమలో నే కాకుండ సాధారణ ప్రేక్షకుల లో కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది అనడం లో సందేహం లేదు .

దర్శకుడు కరుణ కుమార్ పలాస తోనే తన మేకింగ్ ఎంత రస్టిక్ గా ఉంటుందో అందరికి తెలియచేసాడు. మళ్ళి అలాంటి వైబ్ మట్కా సినిమా కి స్టిల్స్ తోనే ఆశ్చర్యపరిచాడు.

ఇక మట్కా సినిమా లో వైజాగ్ వాసు పాత్రలో వరుణ్ తేజ్ అంచనాలను పెంచేసాడు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ మధ్య టీజర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేలా. బాలీవుడ్ అందాల తార నోరా ఫతేహీ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన స్టిల్స్ ని ఒక్కోటి గా చిత్ర బృందం రిలీజ్ చేస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

సినిమాలో నోరా ఫతేహీ ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తుంది అని తెలిసిందే. ఆడియెన్స్ ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారో వాటికి అనుగుణంగా చిత్ర బృందం ‘లే లే రాజా’ అనే పాటను విడుదల చేశారు.

Read Also : పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

ఈరోజు రిలీజ్ చేసిన ఈ క్లబ్ సాంగ్ లో నోరా ఫతేహీ తన గ్లామరస్ లుక్స్, సెక్సీ మువ్స్ & ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టి పడేసిందనే చెప్పాలి.

రెట్రో స్టైల్ లో రూపొందించిన ఈ పాట, 80ల కాలం పాటలని గుర్తు చేస్తుంది. జివి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందించగా. నీతి మోహన్ ఈ పాటను ఆలపించారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు.

‘మట్కా’ చిత్రాన్ని ఎస్.ఆర్.టీ. ఎంటర్టైన్మెంట్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

Follow us on Instagram

Related posts

ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌

filmybowl

సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్ గా SDT18 మేకింగ్ వీడియో రిలీజ్..

filmybowl

విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది…

filmybowl

Leave a Comment