MOVIE NEWS

“కాంచన 4” మొదలెట్టిన లారెన్స్.. ఈ సారి మరింత కొత్తగా..!!

హారర్ కామెడీ చిత్రాలకు రాఘవ లారెన్స్ పెట్టింది పేరు..తాను ఇప్పటి వరకు ఆ జోనర్ లో తెరకెక్కించిన ప్రతీ సినిమా మంచి విజయం సాధించింది.. ముని సినిమాతో ఈ జోనర్ సినిమాలు స్టార్ట్ చేసిన లారెన్స్ ప్రతీసారి సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ ఉంటాడు..రాఘవ లారెన్స్ హీరోగా అటు దర్శకుడిగా ఎంతో పాపులరయ్యాడు. కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు నాలుగో పార్ట్ ని లారెన్స్ సిద్ధం చేస్తున్నాడు.. ఇటీవల చంద్రముఖి 2 సినిమాతో లారెన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..స్టార్ డైరెక్టర్ పి. వాసు తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది..దీనితో రాఘవ లారెన్స్ కాంచన సిరీస్ తో మళ్ళీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు..

ప్రభాస్ “స్పిరిట్” లో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్..!!

రీసెంట్ గా కాంచన 4 సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు.కాంచన 4 మూవీ లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే..ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కన్ఫమ్ అయ్యింది. బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహీ ఈ సినిమాలో మరో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ ప్రారంభం గురించి జోరుగా వార్తలు వినిపించినా ఇప్పటి వరకు స్టార్ కాలేదు.

తాజాగా రాఘవ లారెన్స్ ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసాడు.. కాంచన మునుపటి సిరీస్ ల కంటే కాంచన 4ను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు..దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.కాంచన 4 సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడి ప్రేక్షకులకు ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి..

 

Related posts

శ్రీ తేజ్ ని పరామర్శించా..కానీ పబ్లిసిటీ చేసుకోలేదు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

మెగాస్టార్ మావయ్యకి కృతజ్ఞతలు.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ..!!

murali

సూర్య 44 : క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment