Allu Arjun Pushpa2 : ఇండియన్ సినిమాలు దగ్గర సెన్సేషనల్ సీక్వెల్స్ లిస్ట్ లో అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచి అలాగే పాన్ ఇండియా ప్రేక్షకులని ఎంతగానో ఎదురు చూసేలా చేసిన సీక్వెల్ చిత్రాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కచ్చితంగా బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2 లే అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాల హైప్ ని పాన్ ఇండియా లెవెల్లో మించేసి అందరిని వెయిటింగ్ లో సెట్ చేసి హైప్ ని పెంచేసుకున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది సందేహం లేకుండా టక్కున చెప్పే పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం పుష్ప2
కాగా మాస్టర్ మైండ్ దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న ఈ సినిమాకి కేవలం అల్లు అర్జున్ స్టైల్ & యాక్టింగ్ తోనే పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ హైప్ నెలకొంది. అందుకే పార్ట్ 1 కి ఏ మాత్రం తగ్గకుండా ఇంకా చెప్పాలంటే మించి పార్ట్ 2 ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎంతలా ఆలస్యం అవుతున్నప్పటికీ పుష్ప 2 పై హైప్ అలానే ఉంది.
అయితే ఇప్పుడు పుష్ప2 గురించి అందరు మాట్లాడుకుంటున్న మాట ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఎలా వుండబోతుంది అని. సుకుమార్ సినిమా లో ఐటెం సాంగ్స్ కి ప్రత్యేకమైన అభిమానులుంటారు పైగా ఇది పుష్ప2 లోని ఐటెం సాంగ్ కావటం తో దేవి కూడా చాలా మంచి బాణీలు ఇచ్చినట్టు తెలుస్తుంది
Read Also : కొత్త విద్య నేర్చుకోడం లో బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ
పుష్ప పార్ట్ 1 లో ఊపేసిన ఐటెం సాంగ్ తరహాలో పుష్ప 2 లో కూడా క్రేజీ ఐటెం నెంబర్ ఉన్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. 1వ భాగం లో సమంత ఆ ప్రత్యేక గీతంలో ఎంతగానో మెస్మరైజ్ చేసింది . ఇప్పుడు పార్ట్2లో ఎవరు చేయబోతున్నారు అనే టాక్ జనాల్లో బాగా నడుస్తుంది.
దానికి తగ్గట్టుగానే మేకర్స్ కి కూడా అల్లు అర్జున్ సరసన రొమాన్స్ చేసే ఆ బ్యూటీ గా ఎవరిని ఫైనల్ చెయ్యాలో కష్టంగా మారుతుందట. కాగా ఇందులో మొదటి ఛాయిస్ గా దేవర ఫేమ్ జాన్వీ కపూర్ పేరు రేసులోకి వచ్చింది ఈమె కాకుండా నేషనల్ క్రష్ అనిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి పేరు కూడా ఈ మధ్య గట్టిగా వినిపించింది.
కాగా ఇప్పుడు ఈ ఇద్దరూ కాకుండా ముచ్చటగా రేస్ లోకి మరో పేరు ఇపుడు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ నటి ఎవరో కాదు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బాలీవుడ్ స్టార్ హీరోలకి సవాళ్లు విసిరిన స్త్రీ ఫేమ్ శ్రద్ధా కపూర్. శ్రద్ధా రీసెంట్ గా బాలీవుడ్ లో 800 కోట్లకి పైగా వసూళ్లతో ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే.
మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇపుడు శ్రద్ధా పేరుని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో బాలీవుడ్ మార్కెట్ లో పుష్ప 2 కి మరింత హైప్ దక్కుతుందని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ నిజంగానే శ్రద్ధా కానీ పుష్ప రాజ్ సరసన స్టెప్ ఏస్తే అది సినిమాని ఓ రేంజ్ లో లేపుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ క్రేజీ కలయికలో ఆ సాంగ్ సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాలి.
Follow us on Instagram