MOVIE NEWS

లైలా ఎఫెక్ట్.. అసభ్యత జోలికి పోనంటున్న విశ్వక్ సేన్..!!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేసే సినిమాలు ఎక్కువగా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు ఉంటుంది.. ప్రతీ సినిమాలో విభిన్న పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం విశ్వక్ సేన్ అలవాటు.. తన అద్భుతమైన నటనతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.. అయితే ఇటీవల విశ్వక్ సేన్ నటించిన “లైలా” సినిమా ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే లైలా సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది..లైలా సినిమాలో విశ్వక్ మొదటిసారి లేడీ గెటప్ లో నటించాడు.. అయితే ఈ సినిమాలో అసభ్యత సీన్స్, డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులకి చిరాకు తెప్పించింది.. దీనితో విశ్వక్ సేన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..

NTR-NEEL : ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం.. ఓపెనింగ్ షాట్ అదిరిందిగా..!!

అయితే తాజాగా లైలా సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఆ సినిమా గురించి విశ్వక్ సేన్ రెస్పాండ్ అయ్యాడు..ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు మీకు పూర్తిగా ఉంది.

ఎందుకంటే నా ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు.నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగానో ప్రేమించారు.. ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను.త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తాను అని విశ్వక్ రాసుకొచ్చాడు

Related posts

అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!!

murali

NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

murali

స్పిరిట్ : ప్రభాస్ కి సరికొత్త కండీషన్ పెట్టిన సందీప్ వంగా..?

murali

Leave a Comment