టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా పరిచయం అయిన తరువాత వరుసగా మూడు సూపర్ హిట్స్ అందుకున్నాడు.. రాజ్ తరుణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ “ కుమారీ 21F”.. ఆ సినిమా తరువాత రాజ్ తరుణ్ కెరీర్ లో ఆ రేంజ్ హిట్ మూవీ రాలేదు.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథా కథనాలు అందించి ఎంతో గ్రాండ్ గా “కుమారి 21F” సినిమాను తెరకెక్కించారు..2015లో విడుదలై సూపర్ హిట్ అయిన ఈ చిత్రం జులై 10న రీరిలీజ్ కానుంది.
SSMB : మహేష్, రాజమౌళి సినిమాలో ఆ హ్యాండ్సమ్ హీరో..?
ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది..ఈ సినిమాకు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కథ చాలా బలంగా మారింది…ఇక ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. చిత్రం విడుదలకు ముందే పాటలు బాగా ట్రెండింగ్ అయ్యాయి.. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయింది..
సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 38 కోట్ల వరకు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాతగా సుకుమార్‌కు కుమారి 21F మూవీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం జులై 10న మరోసారి థియేటర్‌లో విడుదల కానుండటంతో యూత్ అంతా మరోసారి థియేటర్స్ లో చూసేందుకు సిద్ధం అవుతున్నారు.
