MOVIE NEWS

కుబేర : ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. దేవిశ్రీ మార్క్ కనిపించిందా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ “కుబేర”.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. హీరో ధనుష్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ వుంది.. ధనుష్ నటించిన సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది..ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 20న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది

SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!!

ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది.. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్‌డేట్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘పోయి రా మావా’ అంటూ సాగే ఈ పాటను ధనుష్ పాడగా.. భాస్కర్‌ భట్ల లిరిక్స్ రాశారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం రిలీజ్ అయిన సాంగ్ బాగా వైరల్ అవుతుంది.. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది.. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రల్లో కనిపించనుండగా.. నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో నటిస్తున్నాడు..

ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు..రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ కుబేర తో మరో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.ఈ సినిమా కథ ప్రతి ప్రేక్షకుడికి ఎంతగానో ప్రేరణగా నిలుస్తుందని మేకర్స్ ధీమాగా వున్నారు..

Related posts

బన్నీ అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన న్యాచురల్ స్టార్..!!

murali

కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!!

murali

సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!!

murali

Leave a Comment