MOVIE NEWS

క్రిష్ 4 వచ్చేస్తుంది.. దర్శకుడు ఎవరో తెలుసా..?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ హీరోగా అద్భుతంగా రానించారు.. హృతిక్ రోషన్ కు తెలుగు లో కూడా మంచి మార్కెట్ వుంది.. ఆయన నటించిన క్రిష్ సిరీస్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో మూడు చిత్రాలు తెరకెక్కగా.ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక ఈ బ్లాక్ బస్టర్ సిరీస్ నుంచి నాలుగో భాగం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!!

తాజాగా క్రిష్ నాలుగో భాగానికి స్పందించిన అఫీషియల్ అప్‌డేట్ వచ్చింది. క్రిష్ 4 చిత్రానికి హృతిక్ రోషనే దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ వెల్లడించారు..’25 ఏళ్ల కిత్రం నిన్ను యాక్టర్‌ గా ఇండిస్టీకి పరిచయం చేశాను. ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆదిత్యచోప్రా, నేను కలిసి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. దర్శకుడిగానూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైన ‘క్రిష్‌ 4’ కు నువ్వు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది .’అని రాకేశ్‌ రోషన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు..

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఇదిలా ఉంటే హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న “ వార్ 2 “ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తుంది..

Related posts

మహేష్ తో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

filmybowl

ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

filmybowl

“దమ్ముంటే పట్టుకోరా షేకావత్” థీమ్ సాంగ్ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment