Krithi Shetty hopes on that film
MOVIE NEWS

బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..!

Krithi Shetty hopes on that film
Krithi Shetty hopes on that film

Krithi Shetty : ఉప్పెన లాంటి క్రేజీ యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో 100 కోట్ల హిట్ అందుకున్న హీరోయిన్ గా బేబమ్మ అలియాస్ కృతి శెట్టికి తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే వరుసగా యువ హీరోలందరి సినిమాల్లో ఛాన్స్ లు కూడా దక్కించుకుంది.

ఐతే కృతి కి లక్ మాత్రం కలిసి రాలేదు. చేసిన ప్రతి సినిమా కూడా ఆమెను నిరాశ పరిచాయి. దాంతో ఒక్క సినిమాతో స్టార్ రేంజ్ కి వెళ్లిన కృతి అందరి మధ్య ఎలా ఐతే చర్చగా మారిందో అంతే త్వరగా ఫాం కోల్పోయింది. వరుస యువ హీరోలందరితో కలిసి సినిమాలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్క హిట్టు లేక కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది కృతి శెట్టి.

ఇక దాంతో అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడానికి జంకారు నిర్మాతలు. ఇక ఒక్క సినిమా ఛాన్స్ కూడా లేదని గ్రహించి పక్కనే ఉన్న కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. జయం రవితో , ప్రదీప్ రంగనాథ్ తో సినిమా ఆఫర్లు అందుకుంది కృతి శెట్టి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథ్ తో LIK సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో తమిళ్ ఇండస్ట్రీ లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది.ఎందుకంటే తమిళం లో క్లిక్ ఐతే మళ్ళీ తెలుగు నుంచి ఆఫర్లు వస్తాయని అమ్మడు గట్టి నమ్మకం.

ఇవే కాకుండా సినిమాలతో పాటు ఈమధ్య ఫోటో షూట్స్ తో కూడా కృతి కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తుంది. స్లీవ్ లెస్ ఫోటో షూట్స్ తో మళ్ళీ ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

Also Read : పొట్టేల్ సినిమా రివ్యూ

తెలుగు సినిమా తొలి ఆఫర్ ఇచ్చి 100 కోట్ల సినిమా ఇచ్చినా కథల ఎంపికలో తెలివిని ప్రదర్శించలేని అమ్మడు త్వరగానే తన ఫాం కోల్పోయేలా చేసుకుంది. ఐతే టాలీవుడ్ పక్కన పెట్టి ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా కోలీవుడ్ మీద పెట్టింది బేబమ్మ. అక్కడ రెండు మూడు సినిమాలు చేస్తుండగా ఒక్క హిట్ పడినా సరే తన మకాం ని తమిళ పరిశ్రమకు మార్చాలని చూస్తుంది అమ్మడు.

ఈమధ్యనే మలయాళంలో కూడా టోవినో థామస్ తో ఒక సినిమా చేసింది కృతి శెట్టి. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు పెట్టుకోగా మలయాళంలో సోసోగా ఆడిన ఆ మూవీని తెలుగు, తమిళ ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు. మరి తెలుగు లో ఎలాగు ఛాన్సులు లేవని తమిళ, మలయాళంలో గట్టి ప్రయత్నాలు చేస్తున్న కృతి శెట్టికి అక్కడైనా సరైన ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.

Follow us on Instagram 

Related posts

గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!!

murali

ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?

murali

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

murali

Leave a Comment