టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.కోటా శ్రీనివాసరావు దాదాపు 750 పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.. ఆయన విలక్షణ నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి..టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు సినిమాతో కోటా శ్రీనివాసరావు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.. ఆ సినిమాలో చిన్న పాత్రలో ఆయన అద్భుతం గా నటించి మెప్పించారు.. ఆ తరువాత అద్భుతమైన నటనతో ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి మెప్పించారు..కోటా శ్రీనివాసరావు మరణవార్త విని నటుడు చిరంజీవి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు..
మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..?
‘లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట. కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది.శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను’ అని మెగాస్టార్ అన్నారు.
కోటా మరణవార్తపై నందమూరి బాలకృష్ణ స్పందించారు.. ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని బాలయ్య తెలిపారు..
