MOVIE NEWS

నేను వచ్చేలోపే కోటన్న వెళ్ళిపోయాడు..వెక్కి వెక్కి ఏడ్చిన బాబూమోహన్..!!

టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ మరణ వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. నేడు తెల్లవారుజామున 4 గంటలకు కోటా తుది శ్వాస విడిచారు..ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కోట శ్రీనివాసరావు దాదాపు 750 చిత్రాలకు పైగా నటించారు.. ఆయన విలక్షణమైన నటనకు గాను ఎన్నో ప్రతిస్టాత్మక అవార్డులు లభించాయి.. కోటా శ్రీనివాసరావు తనతో ఎంతో అనుబంధం ఉన్న బాబు మోహన్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.. టాలీవుడ్  లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయింది.. కోటా, బాబు మోహన్ లు బయట కూడా అన్నదమ్ములు గా వుంటారు.. ఎంతో ఆత్మీయంగా కలుసుకునేవారు.. కోటా మరణ వార్త విని బాబూమోహన్ ఆయన ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు.

కోటా మరణం.. షాక్ లో టాలీవుడ్.. బాలయ్య, చిరంజీవి ఘన నివాళి..!!

ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ అందరికంటే నాకు ఎంతో ఆత్మీయుడు. నాకు సొంత అన్న లాంటి వాడు. ఆయనకు తమ్ముడు ఉన్నా నన్నే సొంత తమ్ముడిగా చూసుకున్నారు. మొన్న సాయంత్రం కూడా నేను ఓ షూటింగ్ విషయంలో ఫోన్ చేశాను. ఎప్పుడు వస్తావ్ రా అని అడిగాడు. రేపు వస్తానని చెప్పాను.నేను వచ్చేసరికి నా కోటన్న లేడు. వెళ్లిపోయాడు అంటూ బాబు మోహన్ కన్నీటి పర్యంతం అయ్యారు…

కోటన్న, నేను ఎప్పుడు కలుసుకున్న ఎంతో సరదాగా మాట్లాడుకుంటాం. ఒకే ప్లేట్ లో తినేవాళ్లం. ఆయన ఎన్నో సార్లు నాకు అన్నం కూడా తినిపించారు. సినిమాల్లో నాకు నా కోటన్న ఎంతో సపోర్ట్ గా నిలిచాడు… ఆయన ఈరోజు మనల్నందరిని వదిలి వెళ్లడం చాలా బాధాకరం.. కోటన్న లాంటి వ్యక్తీ మళ్ళీ దొరకడు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ బాబు మోహన్ సంతాపం తెలిపారు…

Related posts

కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..?

murali

పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

murali

రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!!

murali

Leave a Comment