రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కింగ్‌డమ్`.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రౌడీ స్టార్ ఈ సారి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నాడు..కింగ్ డమ్ మూవీ కేవలం గ్లింప్స్ తోనే పూనకాలు తెప్పించిందీ.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ క్రమంలో విడుదలకు నెల రోజుల నుంచే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేయబోతున్నారు.`కింగ్ డమ్` సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేసారు..
రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!!
`హృదయం లోపల` అంటూ సాగే పాట ప్రోమోని బుధవారం విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సరసన హాట్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. తాజాగా రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోలో విజయ్ తన స్టైల్ ఆఫ్ లిప్ లాక్స్ తో ఆకట్టుకున్నాడు.. ఆద్యంతం రొమాంటిక్ గా ఈ సాంగ్ ఉండనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది..
మే 2న ఈ సినిమాకు సంబంబధించి పూర్తి పాటని విడుదల చేయబోతున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ ఒక కింగ్‌డమ్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని సమాచారం.