టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది ఫ్యామిలీ స్టార్ గా వచ్చి అంతగా మెప్పించలేకపోయాడు. అంతకు ముందు చేసిన లైగర్,ఖుషి సినిమాలు సైతం విజయ్ దేవరకొండకు నిరాశే మిగిల్చాయి.. దీనితో ఈ సారి సరైన మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కింగ్డమ్’’. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది..కానీ సినిమా అవుట్పుట్ విషయంలో టీం సంతృప్తిగా లేకపోవడంతో చాలా రీషూట్స్ చేశారు.
‘పెద్ది’ కోసం బుచ్చిబాబు పర్ఫెక్ట్ ప్లానింగ్..!!
అయితే, సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది..తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో లేటెస్ట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో మేకర్స్ మరోసారి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేసారు..లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 24వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా వచ్చిన వారం రోజులకు కింగ్డమ్ కూడా బరిలోకి దిగనుంది..ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది.. మొదటి భాగం ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానుంది.. శ్రీలంక సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగబోతున్నట్టు సమాచారం..ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్హీరోయిన్ గా నటిస్తుంది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..త్వరలోనే మేకర్స్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు..
