MOVIE NEWS

కింగ్డమ్ : రౌడీ స్టార్ మూవీ బిగ్ అప్డేట్.. సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్డమ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..దీంతో సినిమా మీద హైప్ రోజు రోజుకు భారీగా పెరుగుతోంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

హరిహర వీరమల్లు : ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..?

ఈ చిత్రాన్ని మేకర్స్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది..ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో రెండవ సింగిల్‌గా ‘అన్న అంటేనే..’ అనే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందులో అన్నా-దమ్ముల అనుబంధాన్ని అద్భుతగా చూపించనున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ తన చిన్నతనంలో సోదరుడితో దిగిన ఒక స్మారక ఫోటో కనిపించగా, అది అభిమానులలో ఆసక్తి రేకెత్తిస్తుంది…

ఈ సినిమాలో హీరో సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సాంగ్ ప్రోమోను జూలై 15న సాయంత్రం 5:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.గత కొంత కాలంగా భారీ హిట్ లేని విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు..ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే విజయ్ కెరీర్ మరింత దూసుకుపోతుంది..

Related posts

ఆ స్టార్ హీరో బ్యానర్ లో పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ..!!

murali

హరిహర వీరమల్లు : పవన్ సినిమా ప్రచార భారమంతా ఆ హీరోయిన్ పైనే..?

murali

వావ్ : బాబు కి పాస్ పోర్ట్ దొరికేసింది..!!

murali

Leave a Comment