టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. అయితే విజయ్ మళ్ళీ తన కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకోలేదు.. విజయ్ దేవరకొండ గతంలో ‘ఖుషి’ వంటి డీసెంట్ హిట్ తర్వాత, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి ఫెయిల్యూర్ అందుకున్నాడు..ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ కింగ్డమ్”..
Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!!
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ విడుదలకు ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలై 31న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జూలై 26న సాయంత్రం 5:00 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌండ్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి సినిమా టీమ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.అలాగే ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో..ట్రైలర్‌పై ఆసక్తి అమాంతం పెరిగింది..ట్రైలర్ తో సినిమాపై మరింత బజ్ పెరగనుంది..
