MOVIE NEWS

కార్తీ “ఖైదీ 2” మరింత ఆలస్యం.. కారణం అదేనా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, స్టార్ హీరో కార్తీ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “ఖైదీ” 2019 సంవత్సరం అక్టోబర్ 25 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.తెలుగులో హీరో కార్తీకి ఖైదీ మూవీ మరో సూపర్ హిట్ ఇచ్చింది..లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లే స్టోరీ సినిమాకు చాలా ప్లస్ గా మారాయి.. అలాగే హీరో కార్తికి ఇచ్చిన మాస్ ఎలేవేషన్స్ అయితే పీక్స్ లెవెల్ లో ఉంటాయి.. హీరో కార్తీ అదిరిపోయే హీరోయిజం ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.. కేవలం ఒక రాత్రి జరిగిన సంఘటన కారణంగా సినిమా మొత్తం అదిరిపోయే ట్విస్టులతో సాగుతుంది..సినిమా మొత్తం పగలు అనేదే చూపించకుండా రాత్రి పూట జరిగే సంఘటనలతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ సక్సెస్ అయ్యాడు..అయితే ఈ మూవీ లో క్లైమాక్స్ లో ఢిల్లీ పాత్రలో నటించిన కార్తీ ఫ్లాష్ బ్యాక్ చూపించలేదు..

షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!!

అసలు ఈ ఢిల్లీ ఎవరు ఎలా జైలుకు వెళ్ళాడు అనే చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు అయితే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు పార్ట్ 2 లో దొరకబోతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ సీక్వెల్ లో స్టోరీ మొత్తం రివీల్ చేయనున్నాడు.ప్రస్తుతం, లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. “కూలి” సినిమా ఈ దసరా లేదా దీపావళికి విడుదల అవుతుందని సమాచారం. కూలీ మూవీ కంప్లీట్ అవ్వగానే లోకేష్ ఖైదీ సీక్వెల్ ను తెరకెక్కించనున్నాడు. కానీ ఖైదీ 2 , 2026 ఏప్రిల్ కు వాయిదా పడిందని తాజాగా తెలుస్తోంది. అంటే లోకేష్ ఈ గ్యాప్ లో ‘కూలీ’ పూర్తవ్వగానే సూర్యా తో ‘రోలెక్స్’ అనే మూవీని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన “విక్రమ్” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమా క్లైమాక్స్ లో స్టార్ హీరో సూర్య “రోలెక్స్” అనే పాత్రలో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేశాడూ.. ఆ పాత్ర ఎంతలా పాపులర్ అయిందంటే.. ఆ పాత్రనే మెయిన్ హైలైట్ గా సినిమా తీసేంతగా ఆకట్టుకుంది..ప్రస్తుతం సూర్య నటించిన తన 44 వ మూవీ ‘రెట్రో’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తరువాత 45వ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. మరి ‘రోలెక్స్’ పట్టాలెక్కేదెప్పుడో తెలియాల్సి వుంది..

 

Related posts

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..ఇండియా హిస్టరీలోనే తొలిసారిగా..!!

murali

వీరమల్లు రిలీజ్ పై సందిగ్దత.. అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా..?

murali

మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..?

murali

Leave a Comment