MOVIE NEWS

ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మూడేళ్ళ క్రితం వరకు  కన్నడ ప్రేక్షకులకి తప్ప ఇండియా వైడ్ అంత క్రేజ్ లేని రిషబ్ శెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ టాప్ మోస్ట్ పాపులర్ యాక్టర్ మరియు దర్శకుడు..కాంతార సినిమా రిషబ్ శెట్టి లైఫ్ నే మార్చేసింది. కేవలం పదహారు కోట్లతో తెరకెక్కించిన కాంతారా సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది…అంతే కాదు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది .తెలుగులో ఈ సినిమా రెండు వారాలు ఆలస్యంగా రిలీజైనా కూడా నలభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాట్టింది..

బుక్ మై షో లో పుష్పరాజ్ మాస్ రికార్డ్.. ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే..?

రిషబ్ శెట్టి స్వయంగా నటించి తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాకు అతను పడ్డ కష్టం అంతా కూడా తెరపై చూపించాడు..కాంతార మూవీ రిషబ్ శెట్టి కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.. ఇదిలా ఉంటే కాంతార సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కిస్తానని గతంలో రిషబ్ శెట్టి చెప్పిన సంగతి తెలిసిందే.. చెప్పినట్టుగానే “కాంతార చాప్టర్ 1” అనే టైటిల్ తో ఈ సినిమా ప్రీక్వెల్ ను సిద్ధం చేస్తున్నాడు.. వచ్చే ఏడాది ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..కాంతార ప్రీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి….అయితే ఇండియా వైడ్ ఫేమ్ వచ్చిన రిషబ్ శెట్టి ఏ విషయంలోనూ తొందరపడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తూ తన కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” సినిమాలో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇదిలా ఉండగా మరో ప్రెస్టీజియస్ మూవీలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు..సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందబోయే ‘ది ప్రైడ్ అఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్’ మూవీలో వీరశివాజీగా రిషబ్ శెట్టి కనిపించబోతున్నాడు.తాజాగా శివాజీగా రిషబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.. ఈ సినిమాను మేకర్స్ 2027 జనవరి 21 రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు..

Related posts

ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ స్టార్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మావ..?

murali

‘కాంతారా2’లో…. మరో స్టార్ హీరో…. ఎవరంటే????

filmybowl

ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు మొదలయ్యేది అప్పుడే

filmybowl

Leave a Comment