టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’..ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..మహా శివుని పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో మంచు విష్ణు కన్నప్ప పాత్ర పోషించాడు. రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే కామియో రోల్లో కనిపించాడు.. ప్రభాస్ చేసింది కామియో రోల్ అయిన ఇంపాక్ట్ వేరే లెవల్లో ఉంది.సినిమాలో ప్రభాస్ 30 నుండి 40 నిమిషాల పాటు కనిపించాడు.. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో అదరగొడుతుంది..
విష్ణు ‘కన్నప్ప’ కు సూపర్ రెస్పాన్స్.. సినిమా మెయిన్ హైలైట్స్ ఇవే..!!
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేసారు.. తమ అభిమాన హీరో ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపిస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కాని వారికి నిరాశ ఎదురైంది. ప్రభాస్‌ని తీసుకురావాలని చిత్ర బృందం ఎంతగానో ప్రయత్నించింది. కాని వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వలన కుదరలేదు. కనీసం ప్రభాస్‌తో వర్చ్యువల్ గా బైట్ చెప్పించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయిన ప్లే చేయించాలని అనుకున్నారు.. కానీ అది కూడా కుదరలేదు. దీంతో ప్రభాస్.. కన్పప్ప మూవీ విషయంలో ఎందుకు సైలెంట్ గా వున్నాడా అని ఫ్యాన్స్ చర్చించుకున్నారు.అయితే ఈ సినిమా ఒప్పుకునే ముందే ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొనని మేకర్స్ కు చెప్పేసాడని సమాచారం.
ఈ రోజు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ తన పాత్రకి సంబంధించిన పోస్టర్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..కన్నప్ప ఈ రోజు నుండి వెండి తెరపై సందడి చేయనున్నాడు.కన్నప్ప వంటి అద్భుతమైన చిత్రం మంచి విజయం సాధించాలని ప్రభాస్ కామెంట్ చేశాడు. ఎట్టకేలకి కన్నప్ప గురించి ప్రభాస్ స్పందించడంతో చిత్రయూనిట్, అలాగే ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు..
