మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్రస్టేజియస్ మూవీ “కన్నప్ప”.. ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.. కన్నప్ప బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది..మహా భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను విష్ణు తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు మేకర్స్ అన్ని ఇండస్ట్రీల నుండి స్టార్ యాక్టర్స్ ని తీసుకోవడం జరిగింది.
అవకాశాలు పేరుతో నన్ను వాడుకుందాం అని చూసారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్..!!
ఈ సినిమాలో మోహన్ బాబు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా నటిస్తుండగా క్యూట్ బ్యూటీ కాజల్ ఈ సినిమాలో పార్వతీగా నటిస్తుంది..ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చేందుకు మంచు విష్ణు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాడు.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.అంత బిజీగా ఉంటూ కూడా మంచు విష్ణు కోసం కన్నప్ప చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించేందుకు ప్రభాస్ అంగీకరించారు. ఎప్పటి నుంచో ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉంది. ఈ చిత్రంలో మహాశివుడు పాత్రలో ముందుగా ప్రభాస్ కనిపిస్తాడు అని వార్తలు వచ్చాయి.
తాజాగా కన్నప్ప చిత్రం నుండి ప్రభాస్ లుక్ ను మేకర్స్ ఎట్టకేలకు విడుదల చేసారు.. తాజాగా రిలీజ్ అయిన లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు.అఘోర తరహాలో ప్రభాస్ గెటప్ ఉంది. మెడలో రుద్రాక్ష మాలలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ గెటప్ లో దైవత్వం కనిపిస్తోంది. దైవ సంరక్షకుడిగా ప్రభాస్ ఈ పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పాలకుడు అంటూ మేకర్స్ ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు..ఒక్క లుక్ తో ప్రభాస్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాడు..