మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే పాన్ ఇండియా రేంజ్ లో మంచు విష్ణుకు మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో ప్రమోట్ చేసేందుకు ఇండియా వైడ్ పాపులర్ అయిన బిగ్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేసేలా ఒప్పించారు..ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.. అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..
సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!!
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. దీనితో మంచు విష్ణు ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని సమాచారం..అయితే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కేవలం గెస్ట్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది.
కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్ చాలా సేపు కనిపిస్తారట..దాదాపు 25-30 నిమిషాల మేరకు ప్రభాస్ స్క్రీన్ పై కనిపించనున్నాడని మంచు విష్ణు తాజాగా తెలిపారు..అలాగే ప్రభాస్ ఇంట్రోనే ఒక సాంగ్ తో ఉంటుందని ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫీ వహించారని ఇందులో ప్రభాస్ చాలా డివోషనల్ గా కనిపించినట్లు సమాచారం..ఈ సినిమాకి స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.