MOVIE NEWS

కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..?

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ “కంగువా”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సూర్య గతంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.కథకు తగ్గట్టుగా శరీరాన్ని మలుచుకుని నటించే నటులు చాలా అరుదుగా వుంటారు.అలాంటి నటులలో తమిళ నటులు ముందుంటారు వారిలో హీరో సూర్య కూడా ఒకరు.సూర్య ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమా కోసం ప్రాణం పెడతాడు .. అంతగా ఆయన ఆ సినిమా కోసం కష్టపడతారు.తన విలక్షణమైన నటనతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సూర్య గత కొంతకాలంగా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!!

పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సూర్య “కంగువా” సినిమాలో నటించాడు.దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.కంగువా సినిమాలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, నటరాజన్, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ వంటి అనేక మంది నటించారు. కంగువా సినిమాను నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ ప్రతిరోజూ కంగువా వసూళ్ల గురించి అప్డేట్ ఇస్తూ వస్తుంది..ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.32 కోట్ల వసూళ్లు సాధించిందని, మూవీ క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రకటించింది.

అయితే తాజాగా సూర్య భార్య జ్యోతిక కూడా కంగువా సినిమా గురించి స్పందించారు. సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, నెగటివ్ రివ్యూస్ ఇచ్చే వారికి అవి తెలియవని ఆమె వారిపై మండిపడ్డారు.కంగువా సినిమాలో కేవలం మొదటి 30 నిమిషాల నిడివి మాత్రమే బాగలేదని, సినిమాలో సౌండ్  ఎక్కువగా ఉండడంతో ఆ 30 నిమిషాలు కాస్త ఇబ్బందిగా ఉంటుందని మిగిలిన సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆమె తెలిపింది.ఇతర పెద్ద సినిమాలకు రాని విమర్శలు ఈ సినిమాకు మాత్రమే ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు.

Related posts

మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!!

murali

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

murali

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

murali

Leave a Comment