MOVIE NEWS

అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కల్కి.. బ్యాలన్స్ రికార్డ్స్ కూడా వదలట్లేదుగా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898 AD”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచింది…ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది..

ఈ సినిమా క్లైమాక్స్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ పార్ట్ 2 కి అదిరిపోయే లీడ్ ఇచ్చాడు.. త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 తెరకెక్కనుంది..ఇదిలా ఉంటే కల్కి 2898 AD ఇప్పుడు మరో సమరానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా జపాన్ రిలీజ్ కు రంగం సిద్దం అయ్యింది. జనవరి 3న జపాన్ లో కల్కి సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇండియన్ సినిమాలకు జపాన్ లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మన దగ్గర సూపర్ హిట్ అయిన ప్రతి సినిమా జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు… ఐతే జపాన్ లో కల్కి రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ అక్కడి ప్రేక్షకుల ప్రేమను చూసి ఎంతో సంతోషించాడు.

ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!

తన మీద తన సినిమా మీద జపాన్ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నాగ్ అశ్విన్ షాక్ అయ్యాడు. అంతేకాదు సినిమా గురించి తనకు వచ్చిన లెటర్స్ ని తన చుట్టూ పేర్చుకుని ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.కల్కి సినిమా జపాన్ లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా అక్కడ సెన్సేషనల్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు..

Related posts

మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!!

murali

ఆ హీరో పై త్రివిక్రమ్ కామెంట్స్.

filmybowl

కాంతార తో వార్ అయేటట్లుందే

filmybowl

Leave a Comment