MOVIE NEWS

కల్కి 2898 AD : కృష్ణుడిగా మహేష్.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898 ఏడీ’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు..ఈ సినిమాలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్  కీలక పాత్ర పోషించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోన్, దిశా పటాని ముఖ్య పాత్రలలో నటించారు..భారీ అంచనాలతో ఈ ఏడాది జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.

లండన్ వీధుల్లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

ఈ మూవీలో దర్శకుడు నాగ్ అశ్విన్ పార్ట్ 2 కి అద్భుతమైన లీడ్ ఇచ్చారు..ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ కల్కి మూవీ పార్ట్‌ 2 పనుల్లో బిజీగా వున్నారు.తాజాగా నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కల్కి సినిమా గురించి అలాగే సూపర్ స్టార్ మహేశ్‌బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు టాలీవుడ్‌లో ఏ హీరోని మీరు ఎంపిక చేస్తారు? అని  అడగ్గా.. ”కల్కి’ యూనివర్స్‌లో కృష్ణుడి పాత్రధారి ముఖం కనిపించకూడదని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు… ఒకవేళ పూర్తిస్థాయి పాత్రలో మహేశ్‌ బాబు కనుక నటిస్తే అభిమానులకు మాత్రం పండగే.. టీజర్‌ రిలీజ్‌కు ముందే ఆల్‌టైమ్‌ బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలుస్తుందనిపిస్తుంది. ‘ఖలేజా’లో ఆయన పోషించిన పాత్ర నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం” అని చెప్పారు.

రెండు భాగాలుగా సినిమాలు రూపొందడంపై మాట్లాడుతూ.. ”కథను బట్టి మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరు రెండు పార్ట్‌లను ఒకేసారి చిత్రీకరిస్తారు. దాని వల్ల బడ్జెట్‌పై అంతగా ప్రభావం ఉండదు. అదే రెండు పార్ట్‌లు రెండు సార్లు షూట్‌ చేస్తే కనుక బడ్జెట్‌ పెరుగుతుంది. ‘కల్కి’ విషయానికొస్తే చిట్టీలు వేసి రెండు భాగాలుగా చేశాం అని ఆయన తెలిపారు..పెద్ద కథ, సింగిల్‌ పార్ట్‌ అనే ఆలోచనతోనే టీమ్‌ అంతా పని చేసుకుంటూ వచ్చాం. ‘ఇది రెండు పార్ట్‌లు అయ్యేలా ఉంది’ అని ఒకానొక సమయంలో ప్రభాస్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను లేదు సర్‌.. ఎడిటింగ్‌ లో కట్‌ చేయొచ్చు అని సర్ది చెప్పేవాడిని. తర్వాత చిట్టీలు వేసి 2 పార్ట్‌లు చేద్దాం ” అని ఫిక్స్ అయినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు.

Related posts

బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!!

murali

పుష్ప 2 : ఆ విషయంలో భారీ రిస్క్ చేస్తున్న సుకుమార్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

murali

పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?

murali

Leave a Comment