Janaka Aithe Ganaka Review : మహాభారతంలో ప్రతి పాత్రకి ఒక ఎమోషన్ ఉంది, ప్రతి పాత్ర చుట్టూ ఒక కధ తాయారు చేసుకోవచ్చు అన్నట్టు…. మధ్య తరగతి జీవితాల్లో కూడా బోలెడు ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి రోజు జరిగే వాటి మీద ఎన్ని కథలైనా రాయచ్చు. అందుకే ఫ్యామిలీ సినిమా తియ్యాలి అనుకోగానే రచయితల రాత మధ్య తరగతి జీవితాల వైపే వెళ్తుంది.
సుహాస్ హీరోగా దిల్ రాజు సమర్పణలో వచ్చిన ‘జనక అయితే గనక’ కూడా మిడిల్ క్లాస్ ఎమోషన్స్ మిక్స్ అయినా స్టోరీ నే.
నేటితరం జంటలు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ పెళ్లి తర్వాత పిల్లల్ని కనడానికి ఆలోచిస్తున్న మిడిల్ క్లాస్ జంట జీవితాన్ని ఈ కథ లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల. మరీ ఆ ప్రయత్నం ప్రేక్షకుల్ని అలరించిందా లేదా. ఎమోషన్స్ ఎంత వరకు కూర్చోబెట్టాయి తెలుసుకుందాం పదండి.
ప్రసాద్(సుహాస్) ఒక మిడిల్ క్లాస్ మనిషి. పిల్లల్ని కని వాళ్ళని ఎలా పెంచాలి అనే దాని మీద చాలా క్లారిటీ తో ఉంటాడు. పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలి లేదంటే పిల్లలే వద్దు అనుకునే తత్వం. అతనికి వచ్చే 30వేల జీతానికి పిల్లల్ని బాగా చూసుకోలేడు కాబట్టి పెళ్లయి రెండేళ్ళు దాటుతున్న పిల్లల జోలికి వెళ్ళడు.
ఇక ప్రసాద్ భార్య(సంగీత విపిన్) భర్త మనసుని అర్ధం చేసుకొని అందుకు తగ్గట్టే జీవితాన్ని సాగిస్తుంటది. ఇంట్లో మాత్రం ప్రసాద్ తండ్రి పిల్లలు ఎప్పుడని గోల చేస్తుంటారు.
ఈ రోజుల్లో ఒక పిల్లోడిని పెంచాలంటే కోటి రూపాయిలు కావాలని ఇంట్లో వాళ్ళకి పేపర్ మీద లెక్కలు వేసి చూయిస్తాడు ప్రసాద్. దీంతో చేసేదేం లేక తండ్రి (గోపరాజు రమణ) కూడా సైలెంట్ అయిపోతాడు.
ఐతే అనుకోకుండా ప్రసాద్ భార్య గర్భవతి అవుతుంది. దీంతో తాను వాడిన కండోమ్ సరిగ్గా పని చేయలేదని ఆ కంపెనీ పై లీగల్ గా వెళ్తాడు ప్రసాద్. తర్వాత ఏం జరిగింది? ఈ కేసులో ఎలాంటి వాదనలు జరిగాయి? కోటి నష్టపరిహారం చెల్లించాలని అడిగిన ప్రసాద్ ఈ కేసు గెలిచాడా లేదా? అనేది మిగతా సినిమా.
కొన్ని ఐడియాలు పేపర్ మీద చాలా బావుంటాయి. ఐడియా వినగానే ఎక్సైట్ అయిపోతారు ఇలాంటి పాయింట్ ఎప్పుడూ రాలేదు’ అనే ఫీలింగ్ తో స్క్రిప్ట్ ఓకే చేస్తారు అయితే ఆ ఐడియాని సినిమాగా మార్చ గలిగే సత్తా దెగ్గరే దర్శకుడి అసలు పనితనం బయటికొస్తుంది.
ఐడియా తో సినిమా మీద క్రేజ్ తీసుకు రావచ్చు అధి ట్రైలర్ వరకు చాలా బావుంటది. మరి సినిమా ని నిలబెట్టాలంటే ఐడియా కి మంచి సీన్స్ పడాలి.
కండోమ్ కంపెనీ మీద కేసు పెట్టడం ఐడియా బావుంది. అయితే ఆ ఐడియాని స్క్రీన్ ప్లేగా మార్చే విషయం లో సినిమాగా చూపించడంలోనే కొంత ఇబ్బంది ఎదురైయింది.
ట్రైలర్ లోనే కాన్సెప్ట్ ని చెప్పేసినప్పుడు సినిమాలో ఆ పాయింట్ ని తెర మీద కి స్పీడ్ గా తేవాలి అలాంటిది ఆ పాయింట్ ఇంటర్వెల్ ముందు మాత్రమే సినిమాలో చూయించాడు దర్శకుడు.
కాకపోతే ఈ మెయిన్ పాయింట్ కి లీడ్ అయ్యే సన్నివేశాలని పేర్చుకుంటూ దర్శకుడు టైం పాస్ చేసాడు. భార్య భర్తల మధ్య ఎమోషన్ ని చూపిడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. పోనీ ఆ తర్వాత అయినా పాయింట్ లోకి వెళ్లాడా అంటే వెళ్ళలేదు. ఇప్పటి తరంలో పిల్లల్ని కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పే సీక్వెన్స్ మాత్రం చాలా బాగా చూపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ హిలేరియస్ గా వచ్చింది.
మొదటి సగం తో పోల్చుకుంటే రెండో సగం చాలా బెటర్ గా సాగుతుంది. మురళీశర్మ ఎంట్రీ తో కథలో డ్రామా సూపర్ గా పండింది. కానీ ఆ మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు పెలవం గా ఉన్నాయి. కోటి కాదు ఐదు లక్షలు ఇష్టము అనడం తో నే కండోమ్ కంపెనీ వోడిపోతుంది అన్నట్టుంటది. ఆ లాజిక్ ని దర్శకుడిని సరిగ్గా రాసుకోవాలి
హీరో గా సుహాస్ కి ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త కాదు. మిడిల్ క్లాస్ పాత్రలు ఈ మధ్య చాల ఎక్కువ వస్తుంది. అలా వచ్చిన పాత్రల్లో ఒక్కటి గా వుండేదే తప్పవ్ప్రత్యేకం గా చెప్పడానికి ఏమి లేదు.
హీరోయిన్ గా సంగీత విపిన్ హుందాగా నటించింది. గోపరాజు రమణ, వెన్నెల కిశోర్ కొన్ని నవ్వులు పంచాడు. అప్పటి వరకూ అసమర్థ లాయర్ గా చూపించిన ఆ పాత్రని.. చివర్లో ఎగ్రసీవ్ చేయడం బాగుంది.
Read Also : అఖిల్ అక్కినేని కొత్త సినిమా ప్రకటన ఆ రోజే నా ?
మురళిశర్మ సెకెండ్ హాఫ్ లో డ్రామాని, సినిమా ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ న్యాయమూర్తి పాత్రలో బాగానే ఉన్నారు
టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపధ్యం సంగీతం మాత్రం పర్వాలేదనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో కావాల్సిన దాని కంటే లౌడ్ గా చేశాడు. సాయి శ్రీరామ్ కెమెరాపనితనం బావుంది అనిపిస్తుంది.
ఇల్లు, కోర్టు చుట్టూ నడిచిపోయే సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా వున్నాయి. పదునైన మాటలైతే లేవు. దర్శకుడు ఐడియా బావుంది. కానీ ఐడియాలో ని సినిమాగా మార్చడంలో ఇంకా కాస్త శ్రద్ధ పెట్టాల్సింది.
ఐడియాలోని కోర్ ఎమోషన్ ని బలంగా చూపించి ఉంటే సినిమా ఇంకాస్త బెటర్ గా వుండేది. ఇప్పటికి అయితే ఇప్పటికీ సినిమాకి ఢోకా లేదు. ఎక్కడ లైన్ దాటినా ఫామిలీస్ ఔట్ రైట్ రిజెక్ట్ చేసే అవకాశం ఉండడం తో దర్శకుడు పరిది దాటలేదు. దాన్ని వీలైనంత డీసెంట్ గా ట్రీట్ చేశారు.
కామెడీ, వెన్నెల కిషోర్ టైమింగ్.. ఈ సినిమాని నిలబెట్టేసాయి. చివర్లో బామ్మ ఇచ్చే ట్విస్ట్ అయితే ఇంకా సూపర్ గా చెప్పింది. అది ఇక్కడ చెప్పడం కుదరదు సినిమా లోనే చూసి తెలుసుకోండి
Filmy Bowl Rating: 2.75/5
Follow us on Instagram