పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగి పోతారు..టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ఏకైక స్టార్ హీరో పవన్ కల్యాణ్.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న పవన్ కల్యాణ్ అన్న చిరంజీవికి సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. పవన్ కెరీర్ లో ఖుషి సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఆ సినిమా తో పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ డబల్ అయింది..అయితే ఆ సినిమా తరువాత పవన్ చేసిన ప్రతీ సినిమా ప్లాప్ అవుతూ వచ్చింది.. పవన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘జానీ’ సినిమా సైతం దారుణంగా నిరాశపరిచింది..ఇలా పవన్ సినిమాలు ప్లాప్ అవుతున్నా కూడా ఫ్యాన్స్ లో పవన్ పై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..
నిన్న వెంకీ మామతో.. నేడు మెగాస్టార్ తో.. అనిల్ ప్లాన్ అదిరిందిగా..!!
సినిమా సినిమాకు పవన్ తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్లారు..అయితే పవన్ ఫ్యాన్స్ కి ఊరటనిచ్చిన సినిమా మాత్రం “జల్సా” అని చెప్పాలి..పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మెదటి మూవీ “జల్సా”.. అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది..ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు..
ఈ సినిమాలో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, పవన్ కల్యాణ్ యాక్షన్, ఇలియానా గ్లామర్ మెయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.. దీనితో చాలా ఏళ్ల తరువాత పవర్ స్టార్ సినిమా అద్భుత విజయం సాధించింది..ఈ సినిమాతో త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ స్నేహితుడిగా మారిపోయాడు..ఇదిలా ఉంటే పవర్ స్టార్ ఐకానిక్ మూవీ అయినా జల్సా రిలీజ్ అయి నేటికీ 17 ఏళ్లు పూర్తి అయింది..గతంలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన వచ్చింది..